రాష్ట్రీయం

గట్టు ఎత్తిపోతలకు నేడు సీఎం శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేస్తారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఇప్పటికే చేపట్టిన తమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఇప్పటికే తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడంతో శుక్రవారం తన పర్యటన సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. గట్టు ఎత్తిపోతల పథకం వల్ల 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 41 చెరువుల కింద ఆయకట్టును స్థిరీకరణ జరుగనుంది. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు కుడి కాలువ కింద 18,500 ఎకరాలకు, ఎడమ కాలువ కింద 9,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే సౌర విద్యుత్ ప్రాజెక్టు కింద రిజర్వు చేసిన 5,000 ఎకరాలకు కూడా సాగునీటి సదుపాయం కలుగనుంది. చెరువులను నింపడం వల్ల 3,000 ఎకరాలు సాగులోకి రానున్నాయి.
తుమ్మిళ్ల ప్రాజెక్టు వల్ల ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఆర్డీఎస్ కాలువలు దెబ్బతినడం, పూడిక పేరుక పోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంతో ఆయకట్టు రైతులను ఆధుకోవడానికి తుమ్మిళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.