రాష్ట్రీయం

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరపతి, జూన్ 28: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నాలుగు మాడీ వీధుల్లో కోలాహలంగా భజనలు, కోలాటాలు, చెక్క భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేడు కడప జిల్లా బంద్
కడప, జూన్ 28: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం కడప జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. వైసీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన ఆధ్వర్యంలో బంద్ కొనసాగనుంది. బంద్ నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

చిత్రం..గరుడ వాహనంపై శ్రీవారు