రాష్ట్రీయం

ఇంకో 15ఏళ్లు మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: తమ పార్టీ ఇంకో 15 ఏళ్లపాటు అధికారంలో ఉండటంతో పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని గాలి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణాను తామే ఇచ్చామని చెబుతుంటారని, అసలు తెలంగాణ ఇచ్చింది అమ్మకాదు, బొమ్మకాదు వందలాది మంది బలిదానాలతో వచ్చిందని కేటిఆర్ వెల్లడించారు. విధిలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఎన్నికల కాలం వచ్చిదంటే చాలు నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతారు. ఇంటింటికి తులం
బంగారం కూడా ఇస్తామంటారు. ఇలాంటోళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన ఆర్య వైశ్య సంఘాలకు చెందిన పలువురు నాయకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తారన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కేవేనని దుయ్యబట్టారు. 1969 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా? అని నిలదీశారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ కాదా? అఅఅన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం అధోగతి పాలైందన్నారు. ఇంటింటికి నీళ్లవ్వడం ఖాయం, కాంగ్రెస్ కిందికి నీళ్లు తెచ్చుడు ఖాయమని కేటిఆర్ అన్నారు. జనాలను చైతన్యం చేస్తామంటూ బిజెపి నేతలు తిరుగుతున్నారు, ఇప్పటికే ప్రజలు చైతన్యంగా ఉన్నారు, వీరు వీపులు పగులుడు ఖాయమని కేటిఆర్ విమర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొంత మంది కొత్తబిచ్చగాళ్లు యాత్రల పేరుతో తిరుగుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గడికి గండికొడుతామని బిజెపి నేతలు అంటున్నారని, ముందు వాళ్ల గడికి ఢిల్లీ గండి పడకుండా చూసుకుంటే బాగుంటుందని చురకేశారు. ఆర్యవైశ్యుల డిమాండ్లను సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి నాయిని హామీ ఇచ్చారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్