రాష్ట్రీయం

నేనొస్తే చదివిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 30: వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తామని, అలాగే వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు మరో రూ.50 వేలు మెస్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరిజిల్లా ముమ్మిడివరంలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంటు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల నాలుగేళ్లుగా వేల మంది విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరమయ్యారన్నారు.తాను నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా విద్యార్ధులు ఇదే అంశాన్ని తనకు చెప్పారన్నారు. ఫీజు రియంబర్స్‌మెంటు పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా హాస్టల్‌లో ఉండి చదువుకునే ప్రతీ విద్యార్థికి మెస్‌ఛార్జీలు కింద రూ.50 వేలు చెల్లిస్తానని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో చదువుకోని విద్యార్థి బయట ఉండకూడదని, తమ పిల్లల్ని బడికి పంపించే ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తానన్నారు. 25 మంది ఎంపీలను
గెలిపిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని నిర్ణయించే అధికారం తమకు లభించి రాష్ట్రానికి కావాల్సిన సదుపాయలు సాధించుకోవచ్చని ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు చేసిన ప్రకటనలో ఎంత వాస్తవం ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మవద్ధన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీ కలిసి 17 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే కాకుండా ముగ్గురు వైసీపీ ఎంపీలను సంతలో పసువుల మాదిరిగా కొన్నారన్నారు. 20ఎంపీలతో బీజేపీతో నాలుగేళ్ళు కాపురం చేసిన తర్వాత గానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర ప్రయోజనాలు గుర్తు రాలేదా అని జగన్ ప్రశ్నించారు. మళ్లీ 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రాన్ని శాసించవచ్చని ప్రజలను మభ్యపెడుతున్నారని జగన్ అన్నారు. ‘నాలుగేళ్లలో ఎంత పెట్టుబడి సాధించారు..ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా’రంటూ జగన్ నిలదీశారు. విభజన చట్టంలోని అంశాలను ఆరు నెలల్లో అమలు చేయాలని స్పష్టం చేసినా ఒక్క అంశాన్ని కూడా సాధించలేకపోయారన్నారు. హోదా సంజీవని కాదని, హోదా కోసం మాట్లాడితే జైలులో పెట్టిస్తానన్న పెద్దమనిషి ఇప్పుడెందుకు హోదా కోసం పోరాడుతున్నారని నిలదీశారు. హోదా కోసం మొదట నుండి నిస్వార్ధంగా పోరాటం చేస్తున్నది వైఎస్‌ఆర్‌సీపీనే అన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి అనేక రాయితీలు వస్తాయని, ప్యాక్టరీలు, కర్మాగారాలు వస్తాయని, తద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. అంతేకాకుండా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోయారంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో రైతుల ఉత్పత్తులను తక్కువ ధరలకు కొని మూడు నాలుగు రెట్లు అధికంగా ధరలు పెంచి లాభాలు గడిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో మంచినీరు లేకపోయినా, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని బాబుపై విరుచుకు పడ్డారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడంలేదన్నారు. రానున్న ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.

చిత్రాలు..ముమ్మిడివరంలో శనివారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనం. ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్