రాష్ట్రీయం

తుంగభద్రకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, జూన్ 30: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నా భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు జలాశయానికి వేగంగా చేరుతోంది. శనివారం 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు జలాశయం అధికారులు తెలిపారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా శనివారం 1607.79 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 31.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 160 క్యూసెక్కుల నీరు కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజు జలాశయంలో కేవలం 2.80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. తుంగభద్ర జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈసారి రెండు పంటలకు సరిపడ నీరు వస్తుందని ఆశిస్తున్నారు.

చిత్రం..తుంగభద్ర జలాశయం