రాష్ట్రీయం

కలసిరాని ముందస్తు ఖరీఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 30: ముందస్తు ఖరీఫ్ చేపట్టాలన్న సంకల్పంతో ఏటా జూన్ ఒకటి నుంచే గోదావరి డెల్టాల్లో సాగు జలాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. గత రెండేళ్లుగా ఇది కృష్ణా డెల్టాలో సాధ్యపడుతున్నా, గోదావరి డెల్టాలో మాత్రం ముందస్తు ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధం కావడం లేదు. జూన్ మొదటి నుంచి సాగునీరు అందిస్తే.. ఆపై నెలాఖరుకల్లా ఆకుమళ్లు పూర్తి చేసుకుని జూలై నెలాఖరుల కల్లా నాట్లు పూర్తిచేసి ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకుని పంట చేతికి వచ్చే విధంగా ముందస్తు ఖరీఫ్‌కు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కానీ ఈ విధంగా చర్యలు చేపట్టినప్పటికీ గత రెండేళ్లుగా కూడా గోదావరి జిల్లాల్లో ఇది సాధ్యపడటం లేదు. రైతులు ఎప్పటిలాగానే యధావిధిగా ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. సాగునీరు సకాలంలో అందించినప్పటికీ ఖరీఫ్ వ్యవసాయ పనులకు అదనుగా వాతావరణం అనుకూలించడం లేదని రైతులు చెబుతున్నారు.
గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 30 శాతం నారుమడులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం గోదావరి ఖరీఫ్ నారుమళ్ళ దశలోనే ఉంది. ఇంకా ఊడ్పులు దశకు చేరుకోలేదు. జూలై మొదటి వారం నుంచి ఊడ్పులు మొదలైతే సాగునీరు సముద్రం పాలవకుండా బ్యారేజి నుంచి సకాలంలో సమృద్ధిగా సరఫరా చేసే అవకాశం ఉండేదంటున్నారు. అయితే గోదావరి ఖరీఫ్ అవసరాలకు నీటి వినియోగం అంతగా లేకపోవడంతో సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నుంచి ప్రస్తుతం రోజుకు 7000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. గోదావరి నదిలో పుష్కలంగా జలాలు ఉన్నప్పుడు వ్యవసాయ అవసరాలు కానరావడం లేదు..నీరు లేనపుడు అవసరాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి చిత్రమైన పరిస్థితి నుంచి బయట పడాలంటే సత్వరం పోలవరం ప్రాజెక్టు వస్తేనే ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలమని రైతులు అంటున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎపుడు ఎంత నీరు కావాల్సి వస్తే అంత విడుదల చేసుకునేందుకు అవకాశం
ఉంటుందని, ఇపుడైతే ఎక్కువ జలాలు వచ్చినా నిర్ధేశిత నిల్వ తర్వాత లక్షల క్యూసెక్కులు సముద్రం పాలవ్వాల్సిందే తప్ప నిల్వ చేసుకునేందుకు వీల్లేదు.
ఈ విషయం పక్కనబెడితే..ఇటు డెల్టాలకు, అటు వృధాగా పోయే జలాలు వెరసి సుమారు 22వేల క్యూసెక్కుల వరకు అఖండ గోదావరి నీటి లభ్యత ఉంటోంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద శనివారం పాండ్ లెవెల్ 13.99 మీటర్లు ఉంది. నీటి మట్టం 10.93 అడుగులు నమోదైంది. తూర్పు డెల్టాకు 3600 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 1800 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6000 క్యూసెక్కులు వెరసి మొత్తం 11400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి జూన్ 17 నుంచి బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 21 పంపుల ద్వారా 7000 క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. గత 17 నుంచి ఇప్పటి వరకు పట్టిసీమ ఎత్తిపోతల పధకం నుంచి కృష్ణా డెల్టాకు 4.88 టిఎంసీల జలాలు అందించారు. గోదావరి నదిలో గత ఏడాది ఇదే కాలంలో సుమారు 30వేల క్యూసెక్కుల వరకు డిశ్చార్జి వుంది. ప్రస్తుతం సుమారు 21 వేల క్యూసెక్కులు నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం సీలేరు నుంచి రోజుకు గోదావరి నదిలో 3500 క్యూసెక్కుల నుంచి 4000 క్యూసెక్కుల వరకు కలుస్తున్నాయి. పోలవరం పనుల జరుగుతున్న అంగుళూరు వద్ద నీటి మట్టం పెరిగింది. దీంతో డయాఫ్రం వాల్ మీదుగా లోతైన నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ గోదావరి డెల్టాల్లో ముందస్తుగా సాగునీరు అందించినప్పటికీ ఖరీఫ్ పనులు మాత్రం సాగడం లేదు.