రాష్ట్రీయం

యుద్ధమంటూ వస్తే.. అది నీటికోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 30: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి మనదేశం నాయకత్వం వహించే శక్తి ఉందని, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలను అందుకుంటున్నా ఇంకా అనేక అంశాలు మన ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయని అందులో స్వచ్ఛమైన తాగునీరు, పేదరిక నిర్మూలన, పారిశుద్ధ్యం, నాణ్యమైన విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ఉపాధి లాంటివి ప్రధానమైనవని, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంటే అది నీటి కోసమేనని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కైలాసవాడి ఓ శివన్ అన్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం శనివారం శ్రీనివాస ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌కు ఎస్వీయూ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేస్తూ భారతదేశంలో శాస్త్ర, సాంకేతికతను వినియోగించడంలో ముందు వరసలో ఉందన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో అనేక ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఇస్రో ప్రయోగాల ద్వారా దేశంతోపాటు ఇతర దేశాలు కూడా సాంకేతికతను వినియోగించుకుంటున్నాయని వెల్లడించారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో ఎన్నో అద్భుతాలు సాధించిందన్నారు. రానున్న తరాలకు అవసరమైన వైజ్ఞానాన్ని,సాంకేతికతను అందించేందుకు నిరంతరం ఆధునిక పరిశోధనలు సాగిస్తుంటుందన్నారు. ‘గగన్’ ప్రయోగంతో దేశంలోని 50 విమానాశ్రయాలకు సాంకేతిక సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రైల్వే రంగంలోను గగన్ సేవలను వినియోగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చన్నారు. ఇస్రో హాలివుడ్ చిత్రం గ్రావిటీ నిర్మాణ ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇందుకు కారణం నూతన ఆవిష్కరణలన్నారు. నూతన ఆవిష్కరణలకు విజ్ఞానం, ఆలోచనలు మూల స్థంభాలని వివరించారు. మన ఆలోచనలు, కలలు నిద్ర పోకూడదని మాజీ రాష్టప్రతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. దేశం సాంకేతికంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నా కొన్ని సమస్యల పరిష్కారంలో వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం, ఆకలి నిర్మూలన, నాణ్యమైన వైద్యం, పరిశుభ్రత పాటించడం, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, నాణ్యమైన విద్య అందరికి అందించడం, నిరుద్యోగ సమస్య తగ్గించడం, నగరాల్లో వౌలిక వసతులు కల్పన, వ్యవసాయ రంగంలో ఆర్థిక పురోభివృద్ధి సాధించడం, స్వచ్ఛమైన ఇంధనం,ప్రకృతి ఏర్పరుచుకోవడంలో వెనుకబడి ఉన్నామని ఇస్రో చైర్మన్ అన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువత సమష్టిగా కృషి చేయాలని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆధునిక పరిశోధనలు బాటలు వేయాలన్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా పేరుగాంచిన ఎస్వీయూలో విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు. పట్టాలు పొందిన విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలని, అలాగే విద్యను అభ్యసించిన వారికి సమాజంలో బాధ్యతలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య జానకిరామయ్య, రిజిస్ట్రార్ ఆచార్య అనురాధ, పాలక మండలి సభ్యులు డాక్టర్ గురుప్రసాద్, ఆచార్య త్యాగరాజు, ఆచార్య హరి, ఆచార్య బాలసిద్ధముని, అరుణ్, బాబు, డీన్లు ఆచార్య శవరయ్య, ఆచార్య మల్లికార్జున, ఆచార్య కుమారస్వామి, ఆచార్య బాలాజీ ప్రసాద్, ఆచార్య అప్పారావు, పరీక్షల నియంత్రణాధికారి వి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తిరుపతి ఎస్వీ స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న ఇస్రో చైర్మన్ శివన్