రాష్ట్రీయం

‘కౌలు’కు వర్తించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు అమలుపై ఉన్నతాధికారులతో శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమై, సమీక్షించిన కేసీఆర్ మాట్లాడుతూ, ఈ పథకం పంట పెట్టుబడి కోసం రైతులకు మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఇది రైతు బంధుపథకం తప్ప కౌలు రైతుబంధు పథకం ఎంతమాత్రం కాదని వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తింప చేయాలన్న డిమాండ్ అర్థరహితమని కొట్టిపారేశారు. అసలు ఆ వాదనే న్యాయసమ్మతం కాదని అన్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రాజేశ్వర్ తివారీ, పార్థసారథి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, అదనపు అడ్వకేట్ జనరల్ రాంచంద్రరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి తదతరులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆస్తి లీజుకు తీసుకున్నంత మాత్రాన కౌలుదారులు ఎవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కాలేరని అన్నారు. కౌలు రైతులకు రైతుబంధు అంశం కూడా అలాంటిదేనని స్పష్టం చేశారు. నిజానికి కౌలు రైతులు ఎవరనేది స్పష్టంగా చెప్పలేమని, ప్రభుత్వం దగ్గర కూడా వివరాలు ఏవీ లేవని పేర్కొన్నారు. ఏ రైతూ కౌలు రైతులను గుర్తించ లేదని, ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతుకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదని వివరించారు. అటువంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలని సీఎం ప్రశ్నించారు. ప్రతి రూపాయికి ఆడిట్ ఉంటుందని, ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. రైతులే కాకుండా చాలామంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికి, లీజుకు ఇస్తారని అన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇండ్లు, ఆటోలు, కార్లు, ఫంక్షన్ హాళ్లు ఇలా చాలా రకాల స్ధిర, చర ఆస్తులను నిర్ణీత కాలానికి లీజుకు ఇవ్వడం సహజమని, అలా లీజుకు తీసుకున్న వారు ఎప్పటికీ యజమానులు కాలేరన్న సంగతి గుర్తుంచుకోవాలని కేసీఆర్ అన్నారు. రైతుబంధును రైతులకే అమలు చేయాలని, కౌలురైతులకు సాయం అందించాలనే డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కానే కాదని అన్నారు.

చిత్రం..ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్