రాష్ట్రీయం

కౌలు రైతులపై విషం : కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కౌలు రైతులపై విషం కక్కుతున్నారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ధ్వజమెత్తారు. కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేసే ప్రసక్తే లేదని
ముఖ్యమంత్రి తేల్చి చెప్పడంపై కోదండరామ్ శనివారం విలేఖరుల సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు చేసుకునే వారు రైతులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. కౌలుదారులు ఏమైనా భూయజమాన్య హక్కులు డిమాండ్ చేస్తున్నారా? అని ఆయన సీఎంను నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రైతులకు బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కౌలు రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాకపోవడం వల్లే నాలుగున్నరేళ్ళకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి దిగిపోవాలనుకుంటున్నారని కోదండరామ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని కోదండరామ్ ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం.. కోదండరామ్