రాష్ట్రీయం

పచ్చి అవకాశ వాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అవకాశ వాది అనీ, మహబూబ్‌నగర్ ప్రజలనేగాక, జోగులాంబ అమ్మవారినీ మోసం చేసిన ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఎలా లభిస్తాయని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల నుంచి టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె శనివారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. ‘ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ దయ ఉన్నందుకే మీ అయ్య సీఎం అయ్యాడు, నీవు మంత్రివి అయ్యావని గుర్తుంచుకో’ అని ఆమె మంత్రి కే. తారక రామారావునుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని విమర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని గట్టు ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందా? అని ఆమె నిలదీశారు. ప్రతిపక్షాలను కలుపుకుని రాష్ట్భ్రావృద్ధికి పాటుపడతానని చెప్పిన కేసీఆర్ ఏనాడైనా ప్రతిపక్షాలను సంప్రదించారా? అని ప్రశ్నించారు. థర్మల్ ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. గద్వాలకు ఐదు వేల ఇండ్లు ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె అన్నారు. పాలమూరును
మోసం చేస్తున్నందున మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లోగడ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ ఏమి ఉద్ధరించారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులకు ప్రాణం పోసింది కాంగ్రెస్ కాదా? అని ఆమె అన్నారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి మళ్లీ నోరు ఎత్తితే మర్యాదగా ఉండదని, అబద్దాలు సహించమని ఆమె మంత్రి హరీశ్‌నుద్దేశించి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాదు అనేందుకు శుక్రవారం నదిగడ్డ సభనే నిదర్శనమని అరుణ అన్నారు.

చిత్రం..కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ