రాష్ట్రీయం

బలపడదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ‘సంస్థాగతంగా బలపడదాం...ముందస్తుకు సిద్ధమని ముందు నిలబడదాం..’ అని టీపీసీసీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయించారు. శనివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, ఏఐసీసీ తరఫున రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా నియమితులైన ముగ్గురు కార్యదర్శులు బోస్ రాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్, సీఎల్పీ నేత జానారెడ్డితోపాటు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, 119 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకూ రెండు దఫాలుగా నేతలు సమావేశమై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట వారీగా ఇన్‌ఛార్జీలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్, జానారెడ్డి మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని, ఇందు కు పోలింగ్ కేంద్రం నుంచి మొదలుకుని జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు సూచించారు. ఎన్నికల సమయంలో కమిటీలు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల కమిటీల్లో 14 మంది చొప్పున తప్పనిసరిగా నియమించాలన్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు అన్ని పూర్తి చేయాలని వారు ఆదేశించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు శక్తి ప్రాజెక్టును చాలా కీలకంగా చేపట్టాలని, ప్రతి మండలానికి వెయ్యి మంది చొప్పున శక్తిలో నమోదు చేయాలని వారు సూచించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌ను నియమించి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు అందించేలా చూడాలని సూచించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా..
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు వచ్చేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. పరిస్థితులను చూస్తుంటే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగేలా ఉన్నాయని ఆయన చెప్పారు. గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వచ్చే నేతలను ప్రజలతో కలిసి నిలదీయాలని ఆయన సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. మళ్లీ ఓట్ల కోసం మాయ మాటలు చెప్పేందుకు వచ్చే టిఆర్‌ఎస్ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత మీదేనని ఉత్తమ్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను, ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలనుద్దేశించి అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్షా సమావేశాల్లో పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గాంధీ భవన్‌లో నాయకులతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి