రాష్ట్రీయం

ఎమ్సెట్ రెండో దశ కౌనె్సలింగ్ షెడ్యూలు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: క్రీడా కోటా లో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరేందుకు షెడ్యూలు ఖరారైంది. ఎమ్సెట్ ఎంపీసీ స్ట్రీం స్పోర్ట్సు కేటగిరి కౌనె్సలింగ్ షెడ్యూలును కూడా సిద్ధం చేశారు. అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈనెల 5వ తేదీ నుండి ఉద యం 9 నుంచి సాయంత్రం 3 వరకూ ఒకటవ ర్యాంకు నుండి తుది ర్యాంకు వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్లు జరుగుతాయి. 6వ తేదీ బైపీసీ స్ట్రీం స్పోర్ట్సు కేటగిరికి కౌనె్సలింగ్ ఉంటుంది. దీనికి అన్ని ర్యాంకుల వారు హాజరుకావచ్చు. ఇక ఈసెట్ అడ్మిషన్లు కూడా ఆరో తేదీనే జరుగుతాయి. తొలి ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకూ హాజరుకావల్సి ఉంటుంది. ఐసెట్ కౌనె్సలింగ్ కూడా ఆరో తేదీన తొలి ర్యాంకు నుండి చివరి ర్యాంకు వరకూ జరుగుతుంది.
పాలిటెక్నిక్‌ల్లో 11,326 సీట్ల భర్తీ
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,326 సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. స్పెషల్ రౌండ్ అడ్మిషన్ల సమయంలో 2068 సీట్లు మిగిలి ఉండగా, అందులో 3845 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారని, అందులో 1508 మందికి అలాట్‌మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. 29 ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీఅయ్యాయని పేర్కొన్నారు. మొత్తం 55 ప్రభుత్వ కాలేజీల్లో 542 సీట్లు, రెండు ప్రైవేటు
ఎయిడెడ్ కాలేజీల్లో 18 సీట్లు మిగిలాయని చెప్పారు. 2వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.
ఐసెట్ షెడ్యూలు
ఐసెట్ షెడ్యూలును కన్వీనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ నెల 30 నుండి ఆన్ లైన్ ఫైలింగ్, ఫీజు చెల్లింపు ఉంటుందని, అందుకు జూలై 4వ తేదీ వరకూ గడువు ఇచ్చామని అన్నారు. 2వ తేదీ నుండి 4వ తేదీ వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్లకు గడవు ఉంటుందని, సీట్ల కేటాయింపు జూలై 7న జరుగుతుందని, అడ్మిషన్లకు ట్యూషన్ ఫీజును 12వ తేదీలోగా చెల్లించి , 12న కాలేజీలకు రిపోర్టు చేయాలని చెప్పారు.
యూజీసీ రద్దు సరైన నిర్ణయం కాదు:ఎస్‌ఎఫ్‌ఐ
యూజీసీ రద్దు సరైన నిర్ణయం కాదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం తిరుపతి, కార్యదర్శి కోట రమేష్‌లు పేర్కొన్నారు. ఇంత వరకూ యూజీసీ దేశ విద్యారంగంలో ముఖ్యమైన పాత్రను పోషించిందని, కొత్త కమిషన్‌తో దేశ విద్యారంగం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని వారు అభిప్రాయపడ్డారు.