రాష్ట్రీయం

దమ్ముంటే నాపై గెలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ధైర్యం ఉంటే తనపై పోటీచేసి గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మజ్లీస్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పోటీకి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని అన్నారు. శనివారం తన మద్దతుదారులతో హైదరాబాద్‌లో ఆయన భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ, అమీత్ షాపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోక్‌సభ సీటును తమ పార్టీ నుంచి
చేజిక్కించుకోవాలని కొంత మంది తాపత్రయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి ఈ సీటు చేజారదని, ఎవరూ తీసుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే ఎవరైనా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పోటీ చేసినా తమను ఓడించలేరని అసద్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని అసద్ ప్రముఖ మెజీషియన్ పీసీ సర్కార్‌తో పోల్చారు. ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మోదీపై విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్ల వంటి సంఘటనలను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. మైనారిటీలపై వివక్ష చూపించేలా ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అధికార బీజేపీ అమలు చేస్తున్నదని అసద్ దుయ్యబట్టారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న అసదుద్దీన్ ఒవైసీ