రాష్ట్రీయం

రాష్ట్రాలకు తీరని నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 30: పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం తనను కలసిన విలేఖరులతో యనమల మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్, గ్యాస్‌లు జీఎస్‌టీ పరిధిలోకి వచ్చిన పక్షంలో రాష్ట్రాల రెవెన్యూ తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉందన్నారు. పెట్రోలియం, సహజవాయు నిక్షేపాలు మన రాష్ట్రం నుండే అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ వాటిని ఇతర రాష్ట్రాలు బాగా వినియోగించుకుంటున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. దేశంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గత ఏడాదిగా జీఎస్‌టీ అమలవుతోందని, దీని ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకంగానూ, కొన్నిచోట్ల అనుకూలంగానూ ఫలితాలు కనిపించాయన్నారు. జీఎస్‌టీ కారణంగా రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతోందన్నారు. కేంద్రం ఇచ్చే కాంపనే్సషన్ విషయంలో మాత్రం కొన్ని సమస్యలున్నాయని చెప్పారు. జీఎస్‌టీ అమలుచేసేటపుడు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుండి వసూలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల నుండీ నష్టపరిహారం వసూలు చేస్తున్నారన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు దేశంలో ఉన్నాయని, అన్ని రాష్ట్రాల నుండీ నష్టపరిహారం వసూలు చేసి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అందులో నుండి నిధులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికైతే ఆదాయం తక్కువ వస్తోందో ఆ రాష్ట్రానికే నష్టపరిహారం ఇస్తున్నారన్నారు. 14 శాతానికి పైగా రెవెన్యూ వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలకు నష్టపరిహారం ఇవ్వడం లేదని, 14 శాతం రెవెన్యూ గ్రోత్‌రేట్ కంటే తక్కువున్న రాష్ట్రాలకే నష్టపరిహారం ఇస్తున్నారని తెలిపారు. ఇది ఎంతమాత్రం పద్ధతి కాదని గతంలోనే చెప్పామన్నారు. మన దగ్గర వసూలు చేసిన సొమ్మునే మనకివ్వడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి నేరుగా నష్టపరిహారం ఇవ్వాలి తప్పితే ఈ విధానం మాత్రం సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. ట్రేడర్స్ విషయంలో అరెస్ట్ వారెంట్ విధానం కరెక్ట్ కాదని ఖండించారు. చక్కెరపై సెస్ వేసే యోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని యనమల కోరారు. వాస్తవానికి సెస్ వేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. సాధారణ పౌరులు నిత్య జీవితంలో వినియోగించే వస్తువులన్నీ తక్కువ స్లాబ్ విధానంలో ఉండాలని పేర్కొన్నారు. సింగిల్ స్లాబ్ విధానం వలన ప్రజలకు మేలు చేకూరుతుందా? లేదా? అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి యనమల కేంద్రాన్ని కోరారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి యనమల