రాష్ట్రీయం

ఫార్మా హబ్ హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: హైదరాబాద్ ఫార్మా హబ్‌గా రూపొందినట్టు ఐటీ మంత్రి కే. తారకరామారావు చెప్పారు. శనివారం నాడు ఆయన జీనోమ్ వ్యాలీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫెర్రింగ్ ఫార్మాస్యుటికల్స్ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో ఉన్నతస్థానంలో ప్రభుత్వం చేర్చిందని చెప్పారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఫార్మా తన ఆర్ అండ్ డీ విభాగంతో పాటు ఉత్పాదక కేంద్రాన్ని కూడా హైదరాబాద్‌లో ప్రారంభించబోతోంది. 1997లో భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించిన ఫెర్రింగ్ మహారాష్టల్రో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ప్రపంచంలో విశిష్ట పేరు ప్రఖ్యాతులు గడించిన ఔషధ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఆ జాబితాలో ఫెర్రింగ్ కూడా చేరడం సంతోషదాయకమని కేటీఆర్ అన్నారు. నోవారిటస్, జిఎస్‌కే, కెమో, లాంజో ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చాయని, ఆ జాబితాలో ఇప్పుడు ఫెర్రింగ్ కూడా చేరడంతో జీనోమ్ వ్యాలీలో ఒక వీధికి ‘యురోపియన్ ఎవెన్యూ’ అని పేరు పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. జీవశాస్త్రాల్లో మంచి శిక్షణ ఇస్తే అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని మంత్రి అన్నారు.
చిత్రం..ఫెర్రింగ్ ఫార్మాస్యుటికల్స్ సంస్థకు శంకుస్థాపన చేస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్