రాష్ట్రీయం

జాప్యాన్ని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: మిషన్ భగీరథ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయని వర్క్ ఏజెన్సీ కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడమని తెలంగాణ సిఎం కెసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భగీరథ ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యా న్నీ, నిర్లక్ష్యాన్నీ ఎట్టిపరిస్థితిలో సహించేది లేదని అన్నారు. కొన్నిచోట్ల ఓహెచ్‌ఎస్‌ఆర్ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సిఎం ఆ పనులకు డెడ్‌లైన్ విధించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం నాడిక్కడ ప్రగతిభవన్‌లో మిషన్ భగీరథపై సిఎం ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎంపీ బాల్క సుమన్, టీఎస్‌ఐఐడీసీస చైర్మన్ బాలమల్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణం కాలేదనే నెపంతో గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మాణం ఆపాల్సిన పని లేదని స్పష్టం చేశారు. రేయింబవళ్లూ కష్టపడుతూ శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్ భగీరథ కూడా వేగంగా చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల నాటికి 25 వేల ఆవాస ప్రాంతాలకు సురక్షిత నీటిని ప్రతి రోజు సరఫరా చేసే విధంగా అసెంబ్లీలో మాట ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ఆ మాట ప్రకారం నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, కాంట్రాక్టర్లపై ఉందని కేసీఆర్ నొక్కిచెప్పారు. ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతోందని, మిగతా గ్రామాలకు ఆగస్టు చివరి నాటికి పూర్తి కావాలని ఆయన అన్నారు. అంతర్గత పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీపడవద్దని, పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో మినిమమ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ (ఎండీడీఎల్) నిర్వహించాలని, తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వు చేసిన తర్వాత సాగునీటికి నీరు విడుదల చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.