రాష్ట్రీయం

లాభసాటిగా వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడమే గాక రైతుకు తాను చేసే వ్యవసాయం అన్ని విధాలుగా లాభసాటిగా రూపొందించాలన్న ప్రధాన లక్ష్యంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు. స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ వచ్చే ఐదు నెలల్లో హంద్రీ-నీవా పథకం నుంచి హిందూపూర్-మడకశిర వరకు సాగునీటిని తీసుకువెళతామన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పది వేల హెక్టార్లలో పంట సంజీవని పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొలంలో రైతులు తవ్వే ఈ కుంటకు ప్రభుత్వమే నూటికి నూరు శాతం నిధులు ఇస్తుందన్నారు. ఎన్‌ఆర్‌జిఎస్ పథకం కింద వేతనాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. జలవనరులశాఖ మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం నీరు-ప్రగతిపై శే్వతపత్రాన్ని విడుదల చేసారు. వ్యవసాయం, పండ్ల తోటలు, లైవ్ స్టాక్‌లలో 20 శాతం వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందన్నారు. దీనివలన వ్యవసాయ రంగంతో ముడిపడి వున్న 60 శాతం మందికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుందన్నారు. వర్షపు నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవటం, నిల్వ చేయటం, భూగర్భ జలాలను పెంచుకోవటం, నదుల అనుసంధానం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవటం వంటి సమగ్ర విధానాలను అవలంబించటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 3కోట్ల 95 లక్షల ఎకరాల మేర భూమి వుందని, అయితే కోటీ 99 లక్షల ఎకరాలు మాత్రమే ప్రస్తుతానికి వ్యవసాయ యోగ్యంగా కనిపిస్తుందని అన్నారు. ఇందుకోసం 2,390 టిఎంసిలు, అలాగే పరిశ్రమలకు మరో 240 టిఎంసిలు తాగునీటికి 86 టిఎంసిల నీరు అవసరమవుతుందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో సరిపడ నీరు రానప్పటికీ రైతు పంట కాపాడగలిగామన్నారు. పట్టిసీమ నుంచి ప్రస్తుతం 6.5 టిఎంసిల నీటినే మళ్లించగలిగినా వచ్చే ఏడాది నుంచి 80 టిఎంసిల నీటిని అలాగే ఎర్రకాలువ వంటి చిన్న నీటి వనరుల నుంచి మరో 20 టిఎంసిల నీరు కృష్ణాడెల్టాకు రాగలదని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు సాగునీటిని అందిస్తామన్నారు. గాలేరు-నగరి పూర్తిచేయటం ద్వారా కడప, కర్నూలు జిల్లాలకు గ్రావెడితో నీళ్లిస్తామని, గురురాఘవేంద్ర వంటి ఇతర పథకాలను పూర్తిచేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో సోమశిల, స్వర్ణముఖి పూర్తిచేసి అన్ని చెరువులకు నీళ్లిస్తామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో తొలి శే్వతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, కార్యదర్శి శశిభూషణ్, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.