రాష్ట్రీయం

మొక్కల పెంపకంలో విప్లవాత్మక పంథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: అక్కడ మొక్కలు పెంచడానికి మట్టి అవసరం లేదు. నేల చదరంగా ఉండాల్సిన అవస్యకత అంతకంటే లేదు. గోడలపైన కూడా మొక్కలు పెరుగుతాయి. అసాధ్యం అనిపించే ఈ అద్భుతాలన్నీ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’లో మనకు సాక్షాత్కరిస్తాయి. కళ్ల ముందు సరికొత్త లోకాన్ని ఆవిష్కరిస్తాయి. కాయగూరలు, పూల పెంపకానికి సంబంధించిన ఈ ‘సెంటర్’ దేశంలోనే ఆదర్శ కేంద్రంగా మారింది. పాలీహౌస్, వాక్-ఇన్-టనె్నల్ విధానాల్లో సేద్యం, వర్టికల్ గార్డెన్, టెర్రేస్/రూఫ్ గార్డెన్ పెంపకం తదితర అంశాలకు ఇది కేంద్రంగా నిలుస్తోంది. హైటెక్ నర్సరీ, నర్సరీల పెంపకానికి వీలుగా ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ ద్వారా విత్తనాలను వేయడం, మొక్కల పెంపకంలో వినూత్న విధానాలకు ఇది నిలయమైంది. రైతులకు ఉపయోగపడే డెమాన్‌స్ట్రేషన్ సెంటర్‌గా ఈ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కేంద్రాన్ని పరిశీలించే రైతులు తమ పొలాల్లో కొత్త విధానాల్లో కాయగూరలు, పూల పెంపకం సాగుగురించి అవగాహన చేసుకునేందుకు వీలవుతోంది. అలాగే వ్యవసాయ, ఉద్యాన, నాబార్డ్, బ్యాంకింగ్, విద్యుత్ తదితర శాఖల సిబ్బందికి నర్సరీలు, తోటల పెంపకంలో అవగాహనా కార్యక్రమాలను, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రాక్టికల్‌గా పరిస్థితి వివరిస్తున్నారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అని చెప్పవచ్చు. వాస్తవంగా కేసీఆర్ పాలీహౌస్ రైతు కావడంతో దీనివల్ల రైతులకు మంచి లాభం ఉంటుందన్న కారణంగా అదే విధానంలో సేద్యానికి ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసి ఈ కేంద్రంలో పాలీహౌస్ తరహాలోనే ‘వాక్-ఇన్-టనె్నల్స్’ను ఏర్పాటు చేశారు. పాలీహౌస్ నిర్మాణానికి వెయ్యి ఎస్‌ఎఫ్‌టీకి దాదాపు10 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా, వాక్-ఇన్-టనె్నల్‌కు కేవలం నాలుగు లక్షల రూపాయలే ఖర్చుకావడం గమనార్హం. వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ఓసీలు అయితే 75 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 95 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రం అనేక అంశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మట్టిలేకుండా మొక్కలను పెంచే విధానాన్ని ఇక్కడ అభివృద్ధి చేశారు. కొబ్బరి పీచును పొడిగా చేసి, దాంట్లో వర్మికంపోస్ట్ కలిపి (కోకోపిట్) మొక్కల పెంకపానికి ఉపయోగిస్తున్నారు. నర్సరీలతోపాటు, కాయగూరలు, ఆకుకూరలు, పూల పెంపకానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. కోకోపిట్ ద్వారా మొక్కలు పెంచే విధానంలో కలుపు రాదని, మొక్కలకు ఇన్‌ఫెక్షన్ సోకదని ఈ కేంద్రం అధిపతి ఏడీహెచ్ లియాక్ అహ్మద్, మరో అధికారి రామకృష్ణ తెలిపారు. ఒక అంగుళం చదరపు వైశాల్యం కలిగిన బాక్సుల రూపంలో ఉన్న ట్రేలలో కోకోపిట్‌ను నింపుతున్నారు. వీటిలోనే ఆటోమెటిక్ సీడింగ్ యూనిట్ (మిషన్) ద్వారా విత్తనాలను (ఆటోమెటిక్) విత్తుతున్నారు. ఈ ట్రేలను కేంద్రంలో ఉన్న ‘హైటెక్ నర్సరీ’ లో 20 రోజు పాటు పెంచుతున్నారు. హైటెక్ నర్సరీల్లో వాతావరణం 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండకుండా ఏర్పాట్లుచేశారు. ఆ తర్వాత ఈ మొక్కలున్న ట్రేలను హైటెక్ నర్సరీ నుండి వాక్-ఇన్-టనె్నల్‌కు మార్చి ఐదారు రోజుల పాటు పెంచుతారు. సాధారణ ఉష్ణోగ్రతను ఈ మొక్కలు తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రైతులకు నారు పంపిణీ చేస్తున్నారు.
పాలీహౌస్, వాక్-ఇన్-టనె్నల్స్‌ను ‘డెమోన్‌స్ట్రేషన్’గా ఏర్పాటు చేయడంతో తెలంగాణ నుండేగాక ఇతర రాష్ట్రాల నుండి కూడా రైతులు వచ్చి అధ్యయనం చేస్తున్నారు. పూలు, కాయగూరల మొక్కలను ఏ విధంగా పెంచాలో ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. టమాటా, వంకాయ, బెండకాయ, క్యాప్సికం, మిర్చి తదితర కాయగూరలను పండిస్తూ రైతులు ఉత్సాహపరుస్తున్నారు. అలాగే ఆకుకూరలు కూడా పండిస్తున్నారు. ఒక ఎకరాపై రైతులకు ఖర్చులు పోను రెండులక్షల రూపాయల నుండి ఐదులక్షల వరకు ఆదాయం వస్తోంది.
వర్టికల్ గార్డెన్ హైలెట్
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం ప్రధాన గోడలపై ‘వర్టికల్ గార్డెన్’ను డెమాన్‌స్ట్రేషన్‌గా పెంచుతున్నారు. చిన్నచిన్న ప్లాస్టిక్ బాక్స్‌ల్లో మట్టి లేదా కోకోపిట్ నింపి అలంకరణ, పూలమొక్కలను గోడలపై పెంచే విధానమే వర్టికల్ గార్డెన్ ఉద్దేశం. ఒక గోడపై వెయ్యికిపైగా బాక్స్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుంది. వర్టికల్ గార్డెన్ వల్ల గోడలే అలంకరణగా మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే వర్టికల్ గార్డెన్‌కు ప్రచారం వస్తోంది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కాయగూరలు, పూల మొక్కల పెంపకం చూడముచ్చటగా ఉంది.