రాష్ట్రీయం

రైతులకు ఆధునిక మెళకువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంద్రాల్లో పూలతోటల పెంపక, కాయగూరల మొక్కల పెంపకాల్లో చేపడుతున్న కొత్త మెళకువలను రైతులకు అందించేందుకు ఉద్యాన శాఖ సిబ్బంది శ్రద్ధగా పనిచేయాలని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి కోరారు. సచివాలయంలో గురువారం రాష్టస్థ్రాయి కార్యనిర్వహక కమిటీ (మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్-ఎంఐడిహెచ్ అండ్ హార్టికల్చర్ ఫామ్స్) సమావేశం పార్థసారథి నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018-19 సంవత్సరానికి 84.79 కోట్ల రూపాయల వ్యయంతో వార్షిక ప్రణాళికను ఆమోదించారు. రైతులకు పండ్ల మొక్కలు, కాయగూరమొక్కలను ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో సాగు చేయడం, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాక్ హౌస్‌లు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు తదితర విషయాల్లో ఆర్థిక సాయం చేస్తారు. కాగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని వీటికి ప్రచారం కల్పించాలని, ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడేలా చూడాలని పార్థసారథి సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి, వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.