రాష్ట్రీయం

చరిత్ర కనుమరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: సుమారు ఎనిమిది దశాబ్దాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు విశిష్ట సేవలు అందించిన అద్భుత నిర్మాణం సెంట్రల్ బస్ స్టేషన్ చరిత్ర ఇకపై కనుమరుగు కానుంది. సీబీఎస్‌గా అందరికీ చిరపరచితమైన ఈ అద్భుత నిర్మాణం గౌలిగూడ బస్ స్టేషన్ భారీ షెడ్డు గురువారం తెల్లవారు జామున కుప్పకూలింది. భారీ శబ్దంతో అది పడిపోవడంతో సమీపంలో ఉన్న వారంతా ఏం జరిగిందోనన్న ఆత్రుతతో అక్కడికి పరుగులు తీశారు. ఈ బస్టాండ్‌కు కాలం తీరిపోవడంతో కూలిపోయే అవకాశం ఉందని
జీహెచ్‌ఎంసీ హెచ్చరికల నేపధ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో జూన్ 30 నుంచే బస్సుల రాకపోకలతోపాటు, ప్రయాణికులను అనుమతించడం కూడా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఒక చారిత్రక నిర్మాణం ఇకపై కనబడదన్న వాస్తవాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ఆపద సంభవించలేదు. సంఘటన గురించి తెలియగానే పోలీసులు, ఆర్టీసీ అధికారులు హుటాహుటిన విచ్చేశారు. ఎవరినీ సమీపంలోకి రాకుండా బారిగేడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, టిఎస్‌ఆర్టీసి ఇన్‌చార్జి ఎండి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ కూలిన సిబిఎస్ షెడ్డును సందర్శించారు.
సీబీఎస్ నుంచి గతంలో హైదరాబాద్‌లోని 29 డిపోల నుంచి 510 బస్సులు నిత్యం రాకపోకలు జరిగేవి. ప్రతి రోజు 85 వేల మంది ఈ బస్‌స్టేషన్ ద్వారా ప్రయాణించేవారు. 1930లో నిజాం కాలంలో నిర్మించిన ఈ భారీ షెడ్డును ఆ తర్వాత 1951లో ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. డిపోగా మార్చింది. అనంతరం బస్ స్టేషన్ నిర్వహణ మొదలుపెట్టింది. 1930లో అమెరికాకు చెందిన బట్లర్ కంపెనీ ఈ సిబిఎస్ షెడ్ నిర్మించగా, దీనికి మిసిసిపీ ఏయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్‌గా నామకరణం చేశారు. వాస్తవానికి దానిని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన విమాన స్థావరం కోసం దీన్ని ఏర్పాటు చేయించారు. దశాబ్దాల తరబడి సేవలు అందించిన తర్వాత, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని మూసీ నది మధ్యలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)ను నిర్మించారు. సీబీఎస్‌లో నిలిచే అన్ని సర్వీసులను ఎంజీబీఎస్‌కు తరలించారు. దీనితో సీబీఎస్ ఖాళీ అయ్యింది. 2006 నుంచి సిటీ బస్సులు నిలిపివేందుకు వీలుగా టెర్మినల్‌గా మార్పు చేశారు. అప్పటి నుంచి నగరంలో 33 రూట్లలో సుమారు 2385 సిటీ బస్ సర్వీసులను నడుపుతూ వచ్చారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోకి వచ్చే సీబీఎస్ ద్వారా విస్తృతమైన సేవలందిస్తూ వచ్చింది.