రాష్ట్రీయం

ఆపరేషన్ 2024..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 5: రాష్ట్రానికి న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో అసంతృప్తితో ఉన్న ప్రజలను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మక రీతిలో ముందుకెళుతున్నారు. రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం 2024లోనే సాధ్యమని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘ఆపరేషన్ 2024’ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా ఓడితేనే ఆ తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలు పెట్టుకోవచ్చని, లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పార్టీ పొత్తు కోసం పాకులాడాల్సిన పరిస్థితులు వస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.గత నాలుగేళ్ల నిరాశావాదాన్ని వదిలి తిరిగి కష్టపడాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందని, ఫలితంగా 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం సాధించి రాహుల్ ప్రధాని పదవిని చేపడతారన్న విశ్వాసంతో ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనుమానాలేమీ లేవని అయితే తమ పార్టీకి కంచుకోట అయిన ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పటిష్టం చేయడాన్ని కాంగ్రెస్ నేతలు సవాల్‌గా తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఏపిలో అధికారంలోకి రావడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా మొదటగా పార్టీ పరిశీలకునిగా వివాదరహితుడిగా ముద్ర ఉన్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని నియమించారు. విభజన సమయంలో పార్టీని వీడిన నేతలందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. అంతేగాక పార్టీ నేతలందరితో విజయవాడలో ఒకసారి సమావేశమై ఆ తరువాత సీనియర్, కీలక నేతలతో వ్యక్తిగతంగా వారింటికి వెళ్లి కలిసి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు. కాగా ఈ సమావేశాల్లో దాదాపు అంతా పార్టీ అధిష్టానం రచించిన వ్యూహ ప్రణాళికను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ వ్యూహ రచన ప్రకారం 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మరో మారు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు కాని వైకాపా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదు. బీజేపీతో విభేదించి పోరుబాట పట్టిన టీడీపీకే విజయావకాశాలున్నాయని వారు అంచనా వేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ పార్టీకి కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తే టీడీపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావించినట్లు తెలుస్తోంది. దీంతో వైకాపా మరో మారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని
వైకాపా నేతలు పార్టీని వీడి మరో పార్టీలో చేరడానికి సిద్ధపడతారని వ్యూహకర్తలు ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ 2019లో అధికారంలోకి వచ్చినా 2024 నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు గణనీయంగా పెరుగుతుందని, అంతేగాక అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు మీద పడి చురుగ్గా పని చేసే అవకాశం లేదని వారంటున్నారు. ఒకవేళ 2019లో చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే కాంగ్రెస్‌కు మరింత ప్రయోజనం చేకూరుతుందన్న భావనలో వారున్నారు. ఇదే జరిగితే 2024 నాటి ఎన్నికలకు వైకాపా కనుమరుగవడం, టీడీపీ బలహీనపడటం ఖాయమని లెక్కగట్టినట్లు వెల్లడవుతోంది. దాంతో ఆ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ప్రజలు తిరిగి తమను అధికారంలోకి తీసుకువస్తారని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఇప్పటి నుంచే పూర్తిస్థాయి కసరత్తు చేస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి శాసనసభలో అడుగు పెట్టడమే కాకుండా పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పార్టీ సీనియర్ నేతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడవుతోంది.
ఒకవేళ 2019లో వైకాపా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఆశలు నెరవేరడానికి దశాబ్దాల కాలం పడుతుందని పార్టీ వ్యూహకర్తలు రాష్ట్ర నేతలను హెచ్చరించినట్లు సమాచారం. ఇక 2019లో టీడీపీ రాష్ట్రంలో గణనీయమైన పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్రంలో వారు కాంగ్రెస్‌కు సహకరిస్తారని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర నేతలకు పలు పదవుల్లో నియమించడానికి ప్రాధాన్యత ఇస్తామని కూడా పార్టీ సీనియర్లు నేతలను భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీతో సమావేశమైన సమయంలో ఆయన కూడా చెప్పనున్నారని వారు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ‘ఆపరేషన్ 2024’ ప్రారంభించినట్లయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.