రాష్ట్రీయం

జాప్యమెందుకు.. నోటీసివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 5: లోక్‌సభలో తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారని లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై చర్చకు అనుమతించాలని కోరుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం ఎంపీలు నోటీసు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. ఇందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖను ఆయన గురువారం మీడియాకు విడుదల చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం’పై ప్రధాని చేసిన ప్రకటనకు సంబంధించి తెలుగుదేశం సభ్యులు స్వల్పవ్యవధి చర్చకు నోటీసు ఇవ్వాలని కోరారు. అవసరమైన రికార్డులతో తాను లోక్‌సభ గుమ్మం వద్ద అందుబాటులో ఉంటానని ప్రకటించారు. చట్టవిరుద్ధంగా విభజన జరిగిన తీరుపై సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. మే 11న కూడా ఇదే అంశంపై ఒక లేఖ రాశానని దానిపై స్పందనలేదని, ఇపుడు మళ్లీ లేఖ రాస్తున్నానని ఈసారైనా స్పందించాలని చంద్రబాబును కోరారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో రాజ్యాంగ విరుద్ధంగా ఏపీ బిల్లును ఆమోదించారని ఉండవల్లి గుర్తుచేశారు. ప్రతీ సమావేశంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి నాశనం చేసేశారని ఆరోపిస్తున్న చంద్రబాబునాయుడుకు, ఎన్డీయే నుంచి బయటకొచ్చేశాక కూడా ఆనాటి ప్రొసీడింగ్స్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నించడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీ మద్దతిచ్చి విభజన బిల్లును ఆమోదింపజేసిందని తెలిసి కూడా 2018 ఫిబ్రవరి 7న లోక్‌సభలో మోదీ చేసిన ప్రసంగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని బాబును ఉండవల్లి కోరారు. ఆనాటి సభలో మోదీ హిందీలో చేసిన ప్రసంగాన్ని అనువదించి లేఖలో ప్రస్తావించారు. ‘ఆంధ్రావారితో ఆ రోజు మీరేదైతే విత్తనం నాటారో, ఎన్నికల హడావిడిలో మీరేదైతే చేశారో, దాని ఫలితంగా..నాలుగేళ్ల తరువాత కూడా అది రగులుతూనే ఉందని’ ప్రధాని అన్నారని వివరించారు. సాక్షాత్తూ దేశ ప్రధాని లోక్‌సభలో ఇంతటి ఆరోపణ చేసిన తరువాత కూడా అన్యాయానికి గురయ్యామనే ఆరోపణ చేస్తున్న మనం, అదే విషయాన్ని పార్లమెంట్‌లో చర్చించడానికి ఎందుకు వెనకాడుతున్నామో అర్ధం కావడం లేదని ఉండవల్లి లేఖలో పేర్కొన్నారు. 2014 ఫిబ్రవరి 18న మధ్యాహ్నం మూడు గంటలకు భారత పార్లమెంట్ చరిత్రలో అత్యంత చీకటి నిర్ణయాన్ని అమలు చేశారన్నారు. ఎన్నడూ ఉపయోగించని 367 ప్రొవిజో వెలికితీసి, తలలు లెక్కపెడ్తామంటూ అది కూడా లెక్కపెట్టకుండా రాష్ట్రం విడిపోయిందంటూ ప్రకటించేశారన్నారు. ఘోరం చేసిన బీజేపీకి చెందిన ప్రధాన మంత్రే ఆరోపించిన తర్వాత కూడా ఆ విషయాన్ని చర్చించాలని నిలదీయకపోవడం దురదృష్టకరమన్నారు. నాలుగేళ్ల తర్వాత యాధృచ్ఛికంగా ప్రధాని ఉపన్యాసం ద్వారా లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో విభజన జరిగినపుడు లోక్‌సభ హాజరుపట్టీ, లోక్‌సభ, రాజ్యసభ ప్రోసీడింగ్స్, పార్లమెంట్ ప్రచురించిన వెర్బాటం రికార్డింగ్, వీడియో లేకపోయినా, ఆరోజు జరిగిన ప్రొసీడింగ్స్ ఆడియో టేపులూ తన వద్ద సిద్ధంగా ఉన్నాయని ఉండవల్లి పేర్కొన్నారు.
ఆ రోజు సభలో రాజ్యాంగబద్ధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించి వుంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదించి, చట్టమయ్యే అవకాశమే లేదని నిరూపించడానికి కావాల్సిన డాక్యుమెంటరీ సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని, పార్లమెంట్‌లో చర్చించడానికి సిద్ధపడితే టీడీపీ సభ్యులకు అందించడానికి లోక్‌సభ గుమ్మం వద్ద పట్టుకుని సిద్ధంగా ఉంటానన్నారు. ఆర్టికల్ 131 కింద ఏపీ సుప్రీం కోర్టులో కేంద్రంపై ఒరిజినల్ సూట్ వేయవచ్చని, ఇదొక అవకాశంగా ఉపయోగించుకోవాలని ఉండవల్లి సూచించారు. అప్పట్లో అద్వాని కూడా బిల్లును వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రధాని ప్రసంగంపై చర్చించాలని నోటీసు ఇస్తే తప్పకుండా అడ్మిట్ అవుతుందని, దేశ వ్యాప్తంగా ఇతర పార్టీల మద్దతు కూడా లభిస్తుందన్నారు.