రాష్ట్రీయం

అప్పుడేమైంది నా కులం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 5: ‘గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇచ్చి, మీ పక్కన ఉన్నప్పుడు నా కులం కనిపించలేదా? మీతో విభేదించి, పార్టీ పెడితే దానికి కులాన్ని అంటకడతారా?’ అంటూ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. విశాఖ నగరంలో వివిధ వర్గాలకు చెందిన వారు గురువారం జనసేన పార్టీలో చేరారు. జననేత మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు బంధువులే తన దగ్గరకు వచ్చి టీడీపీకి మద్దతు తెలపమని అభ్యర్థించారని గుర్తుచేశారు. అప్పటికే జనసేన ఆవిర్భవించిందన్నారు. ‘అప్పటికే టీడీపీ అధికారం కోల్పోయి పదేళ్లయింది. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని మర్యాద పూర్వకంగా ఆయన వద్దకు వెళ్లాను’అని పవన్ స్పష్టం చేశారు. ‘ఒక గదిలో నేను, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యాం. ఎన్నికల్లో మీరు పోటీచేస్తే ఓట్లు చీలిపోయి, తాను ఓడిపోతానని చంద్రబాబు ఆనాడు నాతో అన్నారు’ అని జననేత వెల్లడించారు. ఆనాడు అంతకు మించి వేరే అంశం తమ మధ్య చర్చకు రాలేదని ఆయన పేర్కొన్నారు. మర్నాడే పత్రికల్లో తాను, చంద్రబాబుతో బేరం కుదుర్చుకున్నానని కథనాలు వెలువడ్డాయని ఆయన చెప్పారు. చంద్రబాబు లీకులు ఇవ్వబట్టే పత్రికల్లో ఆ విధంగా వచ్చిందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుతో పాల్గొన్నా, తాను ప్రసంగించలేదని పవన్ గుర్తు చేశారు. చంద్రబాబు మీద ఉన్న గౌరవంతో తాను పోటీ చేయకుండా ఆయనకే సంపూర్ణ మద్దతు ఇచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. తనకు కుల పిచ్చే ఉంటే, చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇచ్చేవాడినని ఆయన ప్రశ్నించారు. తాను కులం పేరు చెప్పుకుని ఎదగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలు భూ కబ్జాలకు పాల్పడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బాబు అవినీతిపై ఆయన చొక్కాపుచ్చుకుని ప్రశ్నిస్తానని పవన్ ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు మాఫియాలతో చేతులు కలిపితే, జనం చేతులు ముడుచుకుని కూర్చోరని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యమేలుతోందని, సీఎం కార్యాలయం వెనుక ఉండి అవినీతి కార్యక్రమాలను నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళ్లడానికి ఈ ప్రభుత్వాలు కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిని అంతమొందించడం కోసమే తను ఎన్నికల బరిలోకి దిగానని జనసేన చీఫ్ వెల్లడించారు.