రాష్ట్రీయం

కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా, అభివృద్ధి మాత్రం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘ప్రజలు కట్టే పన్నులతో కేంద్రం బతుకుతోంది. రాష్ట్రంపై పెత్తనం మాత్రం చేస్తారని, కానీ ఆదుకునేందుకు ముందుకురారు’అంటూ సీఎం నిప్పులు చెరిగారు. విజయవాడలో 3 లక్షల గృహ ప్రవేశాల మహోత్సవంలో బుధవారం సీఎం మాట్లాడుతూ కేంద్రం తీరును ఎండగట్టారు. అలాగే ప్రతిపక్ష వైకాపా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నమ్మకద్రోహం చేసి, నట్టేట ముంచారని ఆయన వాపోయారు. సుప్రీం కోర్టుకు ఎన్నో ఇచ్చామని చెప్పారని, విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాపై కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీరని అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. ‘అందుకే తిరుగుబాటు. పోరాటం చేసి అయినా హక్కులను సాధించుకుంటాం’అని సీఎం ప్రకటించారు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం నిర్మిస్తే, రాయితీలు ఇస్తామని తెలిపామని గుర్తు చేశారు. అయినా కేంద్రం సహకరించడం లేదని ఆయన తెలిపారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, మాట్లాడటం లేదని, రాష్ట్ర హక్కులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీరికి ప్రజల ఓట్లు కావాలి కానీ, వారి సంతోషంతో సంబంధం లేదని విరుచుకుపడ్డారు. కాగా కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకునే ఆలోచన బీజేపీకి లేదని ఆరోపించారు. తమిళనాడు తరహాలో రాష్ట్భ్రావృద్ధికి అందరూ ఒక్కటయ్యే పరిస్థితి రావాలన్నారు. కష్టపడదామని, సంపద సృష్టిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్రం విషయంలో కలసి రాని నేతలు, తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేత కన్నాపై చెప్పు విసరడంపై స్పందిస్తూ, తమ పోరాటం పార్టీపై అని, వ్యక్తులపై కాదన్నారు. ప్రధాని మోదీ కోటి ఇళ్లను నిర్మిస్తానని ప్రకటించారని, కానీ 30 లక్షల ఇళ్లనే నిర్మించారని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇది ఆత్మగౌరవ అంశమని, ఎన్టీఆర్ స్ఫూర్తిగా పోరాడుదామన్నారు.