రాష్ట్రీయం

ఇదో చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో అదనంగా మరో 5 లక్షల గృహాలను మంజూరు చేసి, పేదవాళ్లకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2022 సంవత్సరానికి ముందే పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని స్పష్టంచేశారు. కుటుంబ పెద్దగా ఆడబిడ్డలకు పసుపుకుంకుమ కానుక కింద ఈ ఇళ్లను ఇస్తున్నట్లు తెలిపారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 2వ దశగా మూడు లక్షల గృహ ప్రవేశాల మహోత్సవం సందర్భంగా మాట్లాడుతూ మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయడం తనకు ఆనందాన్నికలిగిస్తోందని, దేశంలోనే ఇదో చరిత్ర అని వ్యాఖ్యానించారు. సొంత ఇల్లు కలిగి ఉండాలనేది ప్రతి వ్యక్తికి ఒక కల అని, ఆ కలను నిజం చేస్తున్న తరుణం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల కుటుంబాల్లో సొంత ఇంటి కలను సాకారం చేసి, వారి జీవితాల్లో భద్రత, భరోసాను కల్పించే ప్రయత్నం చేశామన్నారు. మాటలు చెప్పడమే కాదు అమలులోనూ తాము ముందున్నామని తెలిపారు. ఇబ్బందులు ఉన్నా, పేద వారి సంక్షేమం కోసం కట్టుబడి భారీగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో 20 లక్షల గృహాలను 50 వేల కోట్ల రూపాయలతో నిర్మించి, పేదవాడి సొంత ఇంటికలను నిజం చేస్తామని తెలిపారు. అంతకుముందే ఆ కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. అదనంగా మరో ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేసి, నిర్మిస్తామన్నారు. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున మరో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలను చేపడతామని వెల్లడించారు. సొంత ఇంటి వల్ల ప్రతి ఒక్కరిలో ఆనందం, భద్రత ఉంటుందన్నారు. అద్దె ఇళ్లల్లో ఉండటం వల్ల ఎండ, వానాకాలంలో భయపడుతూ బతకాల్సి వచ్చేదని, దీనికి తోడు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో భయంకర పరిస్థితిని ఎదుర్కొనేవారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సోంత ఇంటి కల నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గతంలో లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు చేయగా, 3 లక్షల గృహ ప్రవేశాలను చేపట్టి మన రికార్డు మనమే బద్దలు చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ హయంలో పేదల గృహ నిర్మాణానికి 11,833 కోట్ల రూపాయలు కేటాయించగా, అందులో కేవలం 7759 కోట్ల రూపాయలే ఖర్చు చేశారన్నారు. అందులో 14.4 లక్షల గృహాలకు సంబంధించి 4150 కోట్ల రూపాయలను డ్రా చేసి, తినేశారని ఆరోపించారు. దీంతో కేవలం 3500 కోట్ల రూపాయలే ఖర్చు చేశారని గుర్తు చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారుల వివరాలపై విచారణ జరిపిస్తే, ఈ దొంగతనం బయటపడిందన్నారు. పేదవాడి పొట్టకొట్టి పందికుక్కుల్లాగా తిన్నారని ధ్వజమెత్తారు. చాలా ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ఆ లబ్ధిదారులకు సాంకేతికంగా మరోసారి ఇళ్లను కేటాయించలేని పరిస్థితి ఉందన్నారు. రాజీవ్ గృహకల్ప పేరుతో తిరుపతి, కడప విమానాశ్రాయాల సమీపంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. కానీ నివాస యోగ్యం కానీ, దెయ్యాలు కాపురాలు ఉండేలా ఇళ్లను నిర్మించారని ఎద్దేవా చేశారు. నేడు గృహ ప్రవేశాలు జరుపుకుంటున్న అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5.8 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. నిర్మించిన ప్రతి గృహం నివాస యోగ్యంగా ఉండేలా, వౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. 13.02 లక్షల ఇళ్లను 19 వేల కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 5.8 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 6205 కోట్ల రూపాయలతో పూర్తి చేశామన్నారు. విశాఖలో 10,600 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆడబిడ్డలకు అన్నగా కానుకగా ఇచ్చానన్నారు.మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నానన్నారు. ఇళ్లల్లో మొక్కలు పెంచాలని, గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. ఇళ్ల స్థలాల కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.