రాష్ట్రీయం

వారంతా నిర్దోషులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆరుగురు పోలీసులపై విధించిన సస్పెన్షన్‌ను రాష్ట్ర హోంశాఖ ఎత్తివేసింది. నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగు చూసిన అనేక అక్రమాలు, అక్రమార్జనలో పోలీసులకూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తొలుత విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం (సిట్) ఆరుగురు పోలీసులకు సంబంధం ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. అనంతరం జరిగిన శాఖాపరమైన విచారణలో పోలీసులకు, నరుూంతో ఉన్న సంబంధాలు, ఇతరత్రా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం, నిరూపణ కాకపోవడంతో వారిపై ఉన్న సస్పెన్షన్ ఉత్తర్వులను హోంశాఖ ఉపసంహరించుకుంది. దీంతో ఈ ఆరుగురిలో అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్ డీజీపీ కార్యాలయంలో శుక్రవారం రిపోర్టు చేసి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మిగిలిన వారు కూడా ఆయా ఉన్నతాధికారుల వద్ద రిపోర్టు చేశారు. కాగా పోలీసులు చేపట్టిన విచారణలో నరుూం ముఠా చేసిన ఎన్నో భూకబ్జాలు, సెటిల్‌మెంట్లతో పలు పార్టీల్లోని ప్రతినిధులకు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నరుూం నివాసం, అతని అనుచరుల వద్ద లభించిన ఆధారాలు, డైరీలో ఉన్న సమాచారం ఆధారంగా పోలీసు అధికారులు, సిబ్బంది పాత్రను గుర్తించారు. కొందరు పోలీసు అధికారులు నరుూంతో కలిసి భోజనం చేయడం, పార్టీలకు వెళ్లడం వంటి ఫొటోలు కూడా దొరకడంతో ఆధారాలకు మరింత బలం చేకూరింది. దీంతో పోలీసు శాఖ విచారణ చేపట్టింది. ఫోటోల ఆధారంగా నరుూంతో సంబంధం ఉన్నట్లు చెప్పలేమని తేల్చేశారు. ఒక వైపు ప్రజాప్రతినిధులకు, మరో వైపు పోలీసులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసు శాఖ దర్యాప్తులో తేల్చేసినట్లు అయ్యింది. దీంతో ఈ కేసును ఇంతటితో ముగించేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. సుమారు 13 నెలల పాటు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక వీరికి పోస్టింగ్‌లు ఇవ్వడమే తరువాయి.