రాష్ట్రీయం

ఉపాధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 6: రాష్ట్రంలో త్వరలో నూతన ఐటీ విధానాన్ని అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆక్రమిత భూముల్లో నిర్మాణాలను నిర్ణీత గడువుతో క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విధానం 2014-2020ను 2018-20గా మార్పుచేస్తూ తీర్మానించింది. సవరించిన విధానం ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీలో ఐటీరంగ వాటా రూ 6500 కోట్లుగా ఉండాలని, ఏడాదికి లక్ష మందికి ఉపాధి కల్పనను లక్ష్యంగా నిర్దేశించారు. ఐటీ రంగం నుంచి ఎస్సీ, ఎస్టీ వాటాగా 540 కోట్లు కేటాయించేందుకూ ఆమోదముద్ర వేసింది. కాగా ఆక్రమిత భూముల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో నిర్ణీత గడువుతో పాటు ప్రత్యేకంగా రుసుముల విధానాన్ని అమలులోకి సంకల్పించింది.రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికై గృహనిర్మాణ శాఖకు అదనంగా 1480 కోట్లు అదనపు బడ్జెట్‌ను కేటాయించే విషయమై మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం, పీఎంఎవై గ్రామీణ్ పథకాల కింద కింద నిర్మిస్తున్న 5లక్షల 66వేల 466 గృహాలకు ఉపాధిహామీతో నిమిత్తంలేకుండా ఇటుకల కొనుగోలుకు ఈ నిధులు వెచ్చిస్తారు. పీఎంఎవై, ఎన్టీఆర్ అర్బన్ పథకం కింద నిర్మించే బహుళ అంతస్తులతో పాటు స్థలాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జర్నలిస్టుల కోసం ప్రభుత్వం నిర్మించే గృహాలకు గ్రామీణ ప్రాంతాల్లో లక్ష, పట్టణ ప్రాంతాల్లో లక్షన్నర రూపాయల అదనపు ఆర్థిక సహాయం అందించేందుకు మంత్రిమండలి సమ్మతించింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న పక్కా ఇళ్ల పథకాల్లో
జర్నలిస్టులను లబ్ధిదారులుగా చేర్చి సమాచారశాఖ ద్వారా ఈ సహాయాన్ని అందిస్తారు. కాగా విశాఖపట్నం, గాజువాక, కొమ్మాది, పరదేశీపాలెంలో ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణ పథకం, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ కోసం భూ సమీకరణ చేసేందుకు వుడాకు అనుమతిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. గాజువాక జంక్షన్‌లో 898.47 ఎకరాలు, కొమ్మాది, పరదేశీపాలెంలో 149.77 ఎకరాల భూ సమీకరణ జరపనున్నారు. రాష్ట్రంలోని రైస్‌మిల్లర్లు 2014 జూన్ ఒకటో తేదీ నుంచి 2015 డిసెంబర్ 31వ తేదీ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతిచేసిన ధాన్యం, బియ్యానికి సంబంధించి సీ ఫారం దాఖలుచేసే గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. గడువులోగా సీ ఫారం సమర్పించే రైస్‌మిల్లర్లు సీఎస్‌టీ యాక్టు ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను రాయితీలకు అర్హులుగా ప్రకటించారు. కాగా దేశంలోనే అతిపెద్ద సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను గ్రీన్‌కో ఎనర్జీస్‌కు అప్పగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రెవెన్యూశాఖ నిర్ణయించిన ధరకు ఈప్రాజెక్టు కోసం 4766.28 ఎకరాల భూమిని కేటాయిస్తారు. నాలుగేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలని మంత్రివర్గం గడవు విధించింది. ఈ ప్రాజెక్టుపై గ్రీన్‌కో 15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కాగా కర్నూలులో నూతనంగా ఏర్పాటైన అబ్దుల్‌కలాం ఉర్దూ యూనివర్శిటీకి బోధనా, బోధనేతర సిబ్బంది నియామకానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం నియమించిన ముగ్గురు విప్‌ల పేషీలలో సేవలందించేందుకు 33మంది సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకనమికల్లీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈబీసీడీ) మేనేజిమెంట్ కమిటీ, సిబ్బంది నియామకానికి కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.
భూ కేటాయింపులు
విశాఖజిల్లా మధురవాడలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు 40 ఎకరాలు స్వాధీనపరుస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. విశాఖజిల్లా అరకు మండలం ఫణిరంగిని గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి పదెకరాలు, ప్రకాశంజిల్లా పామూరు మండలం దూబగుంట బుక్కాపురం గ్రామాల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ట్రిపుల్ ఐటీ నెలకొల్పేందుకు 208 ఎకరాలు, చిత్తూరుజిల్లా వెంకటాపురంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికై ఏపీఐఐసీకి 98. 37 ఎకరాలు, కడపజిల్లా వేంపల్లిలో పవన విద్యుత్ ప్లాంట్‌కు 58.67 ఎకరాలు, కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ ఏర్పాటుకు పదెకరాలు, సీఆర్డీఏ పరిధిలోని 13 వేర్వేరు కార్యాలయాలు, సంస్థలకు 54.33 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏలూరును స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు స్విస్‌ఛాలెంజి విధానంలో షాపోర్జీ,పల్లోంజీ సంస్థకు ప్రాజెక్టు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం 1233.17 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా.