రాష్ట్రీయం

సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేమూరు/తెనాలి రూరల్, డిసెంబర్ 1: రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే సంకల్పంతో జన చైతన్య యాత్ర ప్రారంభించినట్టు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో మంగళవారం నిర్వహించిన జనచైతన్య సభకు హాజరయ్యారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పాలన కొనసాగిస్తోందన్నారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు హెలీకాప్టర్‌లో చేరుకున్న సిఎం, అక్కడి నుంచి కారులో గ్రామానికి చేరుకున్నారు. రైల్వే గేటు నుంచి వేలసంఖ్యలో తెదేపా నేతలు, శ్రేణులు సిఎంకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రగా గ్రామంలోకి బయలుదేరిన చంద్రబాబు ముందుగా అధికారులు నిర్ణయించిన మార్గంలోగాక అప్పటికప్పుడే మరో నిర్ణయంతో దళిత కాలనీలకు వెళ్ళారు. రహదారి వెంట ఏపుగా పెరిగిన గడ్డి, రహదారిపైకి పొర్లి పారుతున్న మురుగునీటిపై పారిశుద్ధ్య కార్మికులను ఆరా తీశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అలాగే కాలనీల్లో రహదార్లు, మురుగునీటి పారుదల సౌకర్యాలు లేకపోవటాన్ని దళిత మహిళలు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సిఎం 5.5 కోట్ల నిధులు గ్రామానికి కేటాయిస్తున్నానని, వాటితో గ్రామంలో పూర్తిగా సిమెంటు రోడ్లు, మురుగునీటి పారుదల కాల్వలు కేవలం మూడు నెలల్లో నిర్మించేలా కలెక్టర్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబులకు ఆదేశాలిచ్చారు. అనంతరం కాలనీలో కొనసాగుతున్న మండల ప్రాథమిక పాఠశాల్లో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకాన్ని సిఎం పరిశీలించారు. పాఠశాలలో పిల్లల హాజరు, వడ్డిస్తున్న భోజనం, ఇతర వసతులు తదితర అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన గ్రామంలోని ప్రధాన వీధుల్లో కలియతిరిగి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులతో సమస్యల సాధనపై సమీక్షించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై గంటపాటు ప్రసంగించారు.

చిత్రం... వేమూరు జనచైతన్య యాత్రలో మాట్లాడుతున్న సిఎం