రాష్ట్రీయం

ఇక రాజకీయ సన్యాసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తాను ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఆర్టీసీ చైర్మన్ వ్యాఖ్యలు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం ఊహించని చర్చకు దారి తీసింది. రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాస
తీర్మాణం వ్యవహరాన్ని ఆపాలని చూస్తే... చివరకు అధిష్ఠానంకు తలనొప్పిని తెచ్చి పెట్టిన్నట్లయ్యింది. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జిడికె-5వ గని వద్ద గేట్ మీటింగ్‌కు హాజరైన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా పిడుగు లాంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. రామగుండం మున్సిపాలిటీలో తాను ఏడేళ్లకు పైగా చైర్మన్‌గా పని చేసి ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఆ తరువాత ఇక్కడి ప్రజలు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ రుణం తీర్చుకునేందుకు అభివృద్ధి కోసం ముందుకు నడిచానని అన్నారు. రెండోవసారి కూడా మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచి ఆర్టీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సర్వేలో గెలుపు గుర్రాలకు సంబంధించి మొదటి పది స్థానాల్లో తన పేరు ఉందని అన్నారు. అయితే తనను ఎన్నుకున్న ప్రజలకు... నమ్ముకున్న కార్మిక వర్గానికి... ఆశించిన మేర అభివృద్ధి చేయలేక పోతున్నందుకు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేశారు. తాను ఏది చేసిన మీ ముందు చెప్పేవాడినని... అయితే అభివృద్ధి చేయడంలో ప్రజా అభిష్టానాకి అనుగుణంగా చేయలేకపోతున్న విషయం నన్ను కలిచి వేసేనందుకే రాజకీయ సన్యాసం తీసుకుంటున్న విషయాన్ని కూడా మీ ముందు నుంచే ప్రకటించాలని ఇక్కడకు వచ్చిన్నట్లు వాపోయారు. ఇది ఇలా మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలన్న విషయంపై కెటిఆర్ స్వయంగా మందలించడం... దీనికి తలొగ్గి వెనక్కి పోతే నమ్ముకున్న కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనన్న భావనతోనే ఈ నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఆర్టీసీ చైర్మన్ పదవికి
సోమారపు రాజీనామా ?
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తన చైర్మన్ పదవికి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ సన్యాసానికి పూనుకున్న నేపథ్యంలో చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గ నివ్వకుండా అధిష్ఠానం అడ్డుపడటం... ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గితే కార్పొరేటర్ల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతలు... కొంతకాలంగా రామగుండంలో జరుగుతున్న గ్రూప్ రాజకీయాల వ్యవహారం... దీనికితోడు చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ సంస్థలో ప్రధాన అధికారులతో సోమారపు సరైన సక్యత లేకపోవడం... వీటన్నింటికి మించి అక్కడ ఏదైనా సంస్థ మంచికి, అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవహారంలో ఆర్టీసీ ఉన్నత ప్రధాన అధికారి ఎడ ముఖం, పెడ ముఖంగా ఉండటంతోపాటు అక్కడ తనకు సరైన ప్రాధాన్యం లేదని భావించి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్న ప్రధాన ఆలోచనలో సత్యనారాయణ ఉన్నట్లు తెలిసింది.
చిత్రం..ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ