రాష్ట్రీయం

కోనసీమలో మరో గ్యాస్ లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జూలై 9: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో సోమవారం చోటుచేసుకున్న మరో గ్యాస్ లీకేజీ ఘటన ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఓఎన్జీసీకి చెందిన కేశనపల్లి వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని వెల్ నెంబర్ 37 నుండి కేశనపల్లి జీసీఎస్‌కు అనుసంధానమయ్యే పైపులైనుకు జీసీఎస్ సమీపంలోనే లీకేజీ ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి దాదాపు రెండు గంటల పాటు ముందుగా గ్యాస్ భారీ స్థాయిలోను, తర్వాత వైట్ క్రూడాయిల్ ఎగసిపడింది. సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది తక్షణమే వెల్ నెంబర్ 37ను మూసివేయడంతో లీకేజీ అదుపులోకి వచ్చింది. జూన్ 16వ తేదీన ఈ ప్రాంతానికి సమీపంలోని గొల్లపాలెం గ్యాస్ టెర్మినల్‌లో లీకేజీ ఏర్పడిన విషయం పాఠకులకు విదితమే. సఖినేటిపల్లి, మలికిపురం మండలాల పరిధిలోని మోరి స్ట్రక్చర్, కేశనపల్లి వెస్ట్ స్ట్రెక్చర్లలోని ఓఎన్‌జీసీ బావిలోని జీసీఎస్‌లకు అనుసంధానం చేసే పైపులైన్లు ఈ విధంగా తరచూ లీకేజీలకు గురికావడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
గొల్లపాలెంలోనూ లీకేజీ...
కాగా గొల్లపాలెం గ్రామం వద్ద కూడా సోమవారం క్రూడాయిల్ లీకేజీ సంభవించడంతో స్థానికులు బెంబేలెత్తున్నారు. కేశనపల్లి వెస్ట్ స్ట్రక్షర్‌లోని 40వ బావి నుండి కేశనపల్లి జీసీఎస్‌కు అనుసంధానమయ్యే పైపులైన్ నుండి ఈ లీకేజీ సంభవిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో క్రూడాయిల్ ఎగజిమ్ముతూ పంట బోదెలలోకి ప్రవహిస్తోంది.

చిత్రం..పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడి పైకి ఎగజిమ్ముతున్న గ్యాస్