రాష్ట్రీయం

గవర్నరే రక్షణ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆరు నెలల వరకూ నగరంలోకి ప్రవేశించకూడదని నగర పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, శాసనమండలి పార్టీ నేత ఎన్ రామచందర్‌రావు, శాసనసభాపక్ష నేత జి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్వీట్ చేశారు. నిజాం మత రాజకీయాలకు కేసీఆర్ ప్రభుత్వ పాలన నిదర్శనమని మురళీధరరావు ధ్వజమెత్తారు. పరిపూర్ణానంద బహిష్కరణ మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. ఇది యావత్ హిందూ సమాజంపై దాడి అని, ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అర్థరాత్రి నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.
ఎంఐఎం నేతలను బహిష్కరించాలి
పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిని నిందించిన వారిపై చర్యలు లేవని, ఈ ప్రభుత్వం ఎవరి చేతుల్లో నడుస్తోందని ఆయన నిలదీశారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ప్రభుత్వ కుట్ర అని అన్నారు. హిందూ దేవుళ్లను తూలనాడే ఎంఐఎం నేతలను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామీజీని బహిష్కరించడం అంటే హిందువులను బహిష్కరించడమేనని అన్నారు. స్వామిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
బీజేపీ వౌన ప్రదర్శనలు
పార్టీ పిలుపు మేరకు తెలంగాణలో పలు చోట్ల వౌన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. పరిపూర్ణానంద బహిష్కరణ ను ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
స్వామి పరిపూర్ణానందపై పోలీసులు తీసుకున్న చర్యలపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈమేరకు వారు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పరిపూర్ణానందను ఎందుకు గృహనిర్బంధం చేయాల్సి వచ్చిందో, నగర బహిష్కరణ ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం బండారు దత్తాత్రేయ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చే విధంగా పోలీసులు తీసుకున్న చర్య సమర్ధనీయం కాదని అన్నారు. గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకులు కనుక ఈ విషయంలో ప్రభుత్వ చర్యలపై విచారణ జరపాలని కోరామని అన్నారు. స్వామీజీని ఆరు మాసాల పాటు నగర బహిష్కరణ చేయడంపై కారణాలను తెలపాలని అన్నారు.
అందుకే గవర్నర్‌ను కలిశాం..
అధికార దుర్వినియోగంతో పరిపూర్ణానందను గృహనిర్బంధం చేశారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఏ కారణంగా ప్రభుత్వం స్వామీజీని నగర బహిష్కారం చేసిందో చెప్పాలని అన్నారు. తెలంగాణ నుండి బహిష్కరించే హక్కు పోలీసులకు ఎక్కడదని నిలదీశారు. ఇదేమైనా నిజాం రాజ్యమా అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో ఎవరిపైనైనాప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని , అందుకే గవర్నర్‌ను కలిశామని అన్నారు.