రాష్ట్రీయం

పోలవరం జాతీయ ప్రాజెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 12: ‘పోలవరం ఏ ఒక్క పార్టీ ప్రాజెక్ట్ కాదు. అది జాతీయ ప్రాజెక్ట్. దీనిపై రాజకీయం చేయడానికి తాము సిద్ధంగా లేము.’అని కేంద్ర నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే, వీటిని ప్రజల వద్దకు తీసుసుకువెళ్లే బాధ్యతను గడ్కరీ కార్యకర్తలపై ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు డీపీఆర్ తయారైందని, కానీ పనులు ప్రారంభం కాలేదని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి, వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు. పోలవరం భూసేకరణ విషయంలో అనేక లోపాలు గమనించామని, వీటిని పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా నిన్ననే వేశామని చెప్పారు. పోలవరం నిర్వాసిత గిరిజనులు కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయ భూమి, వారి పిల్లలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన బాధ్యత కూడా కేంద్రమే భరిస్తుందని గడ్కరి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరగడానికి నిర్మాణ ఖర్చు పెరిగిపోవడమేనని అన్నారు. కాంట్రాక్టర్లకు కొత్త రేట్లు ఇచ్చే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను అవినీతి రహితంగా,
పారదర్శకంగా, నాణ్యమైనదిగా నిర్మించే బాధ్యత తమదేనని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సివిల్ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
నదుల అనుసంధానానికి ప్రాధాన్యత
తమ ప్రభుత్వం నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గడ్కరి చెప్పారు. ఇంద్రావతి-కృష్ణ-పెన్నా నదుల అనుసంధానానికి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనివలన 700 నుంచి 800 టీఎంసీల నీరు ఆదా అవుతుందని ఆయన తెలియచేశారు. ఈ నీటిని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని రైతులు వినియోగించుకునేందుకు వీలుంటుందని అన్నారు. సోమశిల, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ల్లోకి కావల్సినంత నీటిని పంప్ చేసుకునేందుకు అవకాశం ఉందని మంత్రి గడ్కరీ వివరించారు. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు కూడా కేంద్రం నిధులు కేటాయిస్తుందని గడ్కరీ చెప్పారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆయిల్ సీడ్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. చెరుకు నుంచి వస్తున్న నాలుగు శాతం మొలాసిస్‌ను ఆరు శాతానికి పెంచి, దాంతో ఇథనాల్ తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. దేశంలో చమరు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బయోఇథనాల్ తయారీని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. త్వరలో బస్సులు, ట్రాక్టర్లు కూడా బయోఇథనాల్‌తోనే నడవనున్నాయని అన్నారు. అలాగే మిథనాల్ తయారీకి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఆరు నెలల్లో ముంబై, గౌహతిలో మిథనాల్‌తో నడిచే బస్సులను ప్రవేశపెట్టనున్నామని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, మునుసుఖ్ మాండవీయా, ఎంపీ హరిబాబు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీలు కావూరి సాంబశివరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖలో గురువారం జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న
ఆ పార్టీ జాతీయ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కర