రాష్ట్రీయం

అన్ని జిల్లాలకూ విమాన సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: తెలంగాణలోని అన్ని జిల్లాలకు త్వరలోనే విమానయోగం పట్టనుంది. ప్రతి జిల్లాకూ విమాన సౌకర్యం కల్పించడానికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నెల రోజుల్లో ముసాయిదా నివేదిక సమర్పించాలని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. సచివాలయంలో గురువారం స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ కమిటీ సిఎస్ జోషి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌పై స్టేట్ ఏవియేషన్ అకాడమీ సెక్రటరీ ఎస్‌ఎన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సభ్యులుగా ఉన్న మేనేజింగ్ కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఏయిర్ స్క్రిప్ట్‌లను వినియోగించుకునే అవకాశాలను ముసాయిదా నివేదికలో పొందుపర్చాలన్నారు. అలాగే ఇవీ అందుబాటులో లేని చోట భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే ఏయిర్ స్క్రీప్ట్‌ల ప్రతిపాదనలు నివేదికలో పేర్కొనాలని
సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో ఏవియేషన్ అకాడమీ వివిధ విమానయాన సంస్థలకు శిక్షణ ఇచ్చే విధంగా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఏవియేషన్ అకాడమీ ఇచ్చే ఐదు సంవత్సరాల ఎంఎస్‌సీ కోర్స్ అభ్యసించే వారికి వందకు వందశాతం ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. అలాగే ఏఎంఈ కోర్స్ అభ్యసించిన వారికి కూడా ఉద్యోగాలు విరివిగా లభిస్తున్నాయన్నారు. విమానయాన రంగంలో విదేశాలలోనూ తెలంగాణ యువత ఉద్యోగాలు పొందేలా కొత్త కోర్స్‌లను ప్రవేశ పెట్టాలని సీఎస్ ఆదేశించారు. ఏవియేషన్ అకాడమీ ద్వారా పైలెట్ ట్రైనింగ్ కోర్స్ అభ్యసించిన వారు 75 నుంచి 80 శాతం ఉద్యోగాలు లభించాయన్నారు. దేశంలోనే స్టేట్ ఏవియేషన్ అకాడమీకి మంచి గుర్తింపు లభించిందన్నారు. పైలెట్ ట్రైనింగ్ శిక్షణకు ఇండిగో ఎయిర్ లైన్స్‌తో స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఇప్పటికే ఒప్పందం చేసుకుందని అకాడమీ సెక్రటరీ ఎస్‌ఎన్ రెడ్డి వివరించారు. ఆచరణాత్మక అవగాహన (ప్రాక్టికల్ నాలెడ్జీ) కోసం ఏయిర్ ఇండియాతో కూడా ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏవియేషన్ రంగంలో జరుగుతోన్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అకాడమీని తీర్చిదిద్దాలని సీఎస్ జోషి ఆదేశించారు.
చిత్రం..సచివాలయంలో గురువారం సీఎస్ జోషి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఏవియేషన్ అకాడమీ సమావేశం