రాష్ట్రీయం

జాతీయ నదీజలాల విధానం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ నదీజలాల విధానం (నేషనల్ రివర్ పాలసీ) తీసుకురావలసిన అవసరం ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. నాబార్డ్ (నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్) 37 వ స్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాల్లో నదీజలాల ద్వారా సాగవుతున్న భూముల విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని నదీజలాల పంపిణీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలని సూచించారు. నదీజలాల వినియోగానికి ఒక విధానం తీసుకువస్తే, రాష్ట్రాల మధ్య జలవివాదాలు సమసిపోతాయన్నారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జలాశయాలు కనుమరుగవుతున్నాయని, వీటిని సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు మనకు ప్రకృతిప్రసాదించిన వరమని, నీటిపై ఏ ఒక్కరికీ పూర్తిగా హక్కు ఉండబోదన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తికి ఆహార భద్రత, విద్యుత్ భద్రత, ఆరోగ్య భద్రత ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మూడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటే వారి జీవితం సంతోషదాయకంగా ఉంటుందని, మనం చెప్పుకునే ఆర్థికాభివృద్ధి, గణాంకాలు ప్రధానమైనవి కావని వివరించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి నాబార్డ్ చేస్తున్న కృషిని గవర్నర్ కొనియాడారు.రైతులకు ఎంఎస్‌పీ కన్నా గిట్టుబాటు ధర అవసరమన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందివ్వడం, పంటల ఉత్పత్తులకు సరైన ధర రానిపక్షంలో నిలువచేసుకునే అవకాశం ఉండటం, తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉండటం తదితర అంశాలు రైతులకు లాభదాయకంగా ఉంటాయన్నారు. కేవలం వరిపంట, ఇతర పంటల వల్లనే కాకుండా రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలైన అక్వాకల్చర్, ఉద్యాన పంటలు, పట్టుపరిశ్రమ తదితరాలవల్ల లబ్ది చేకూరుతుందన్నారు. రైతులు వేసిన పంటకు ప్రకృతివైపరీత్యాల వల్ల నష్టం జరిగితే రైతు ఆర్థికంగా చితికిపోతాడని పేర్కొన్నారు. అందువల్ల ఒక పంట నష్టపోతే, ప్రత్యామ్నాయ విధానాలు రైతును ఆదుకునే విధంగా ఒక ప్రణాళిక ఉండాలని సూచించారు. ఈ అంశంపై ఆదర్శంగా ఉండే పైలట్‌ప్రాజెక్టును రైతులకు చూపించి, ఆ తరహా విధానాన్ని అమలు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ పరిశ్రమలు పెద్దఎత్తున నెలకొల్పాల్సిన అవసరం ఉంది, వీటి వల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. నాబార్డు ఈ కోణంలో ఆలోచించి యువతకు సరైన శిక్షణ ఇప్పించి, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ విషయంలో నాబార్డ్ తీసుకుంటున్న చర్యలు బాగా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ (తెలంగాణ) పి. రాధాకృష్ణన్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఏపీ) కే. సురేష్ కుమార్, ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్. సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..నాబార్డ్ 37 వ స్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్