రాష్ట్రీయం

ఎన్‌డీఏలో వైకాపా చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో వైకాపా చేరాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి రామదాస్ అఠావలె పేర్కొన్నారు. ఎన్‌డీఎ నుండి టీడీపీ వైదొలగిన కారణంగా వైకాపా చేరాలని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్‌రెడ్డిని నిలిపేందుకు తాను ప్రధాని నరేంద్రమోదీతోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనూ మాట్లాడతానని అఠావలె చెప్పారు. శనివారం నాడు ఆయన రాజధానిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడని అన్నారు. అయితే ఇటీవల జరిగిన మరో సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఎన్‌డీఏలో చేరాలని అఠావలె కోరడం, నేడు తాజాగా వైకాపా అధినేతను ఎన్‌డీఏలో చేరాలని కోరడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కాగా, అంతకుముందు ఆయన పాల్గొన్న పలు కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం-1989పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆమోదించలేమని అన్నారు. చట్టపరిధిలో అవతలి వ్యక్తికి నష్టం జరగకూడదనే సుప్రీంకోర్టు అభిప్రాయపడిందే తప్ప, ఎస్సీ, ఎస్టీల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురాబోతోందని ఆయన వెల్లడించారు. ఈ బిల్లు ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ హక్కులను కాపాడటమే తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల హక్కులను కాపాడే అంశంలోనూ సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ప్రధాని నరేంద్రమోదీతోనూ, న్యాయ శాఖా మంత్రితోనూ చర్చిస్తోందని చెప్పారు. 1989లో పార్లమెంటులో చేసిన చట్టంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో కొన్ని బోగస్ అని తేలిందని, అయితే ఎక్కువ భాగం అసలైన కేసులేనని గత ఏడాది దేశవ్యాప్తంగా 27వేల కేసులు నమోదయ్యాయని చెప్పారు. తెలంగాణలో గత నాలుగేళ్లలో 7634 కేసులు నమోదయ్యాయని ఇందులో దోషులకు శిక్ష పడింది కేవలం 10 శాతం మందికి మాత్రమేనని పేర్కొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామదాస్ అఠావలె