రాష్ట్రీయం

సర్పంచ్‌ల పాలనకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో సర్పంచ్‌ల పాలనకు ఇత తెరపడనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కాలపరిమితి ఈ నెల 31 తో ముగుస్తుండటంతో, వచ్చే నెల నుండి సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్స్) నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ) పంచాయతీల్లో ప్రత్యేకాధికారులుగా పనిచేసేందుకు అర్హులైన సిబ్బందిని ఇప్పటికే గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల పేర్లతో జాబితాలను సిద్ధం చేశారు. ఒక్కో మండలంలో సగటున 20 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఒక గ్రామపంచాయతీకి ఒక స్పెషలాఫీసర్‌గా ఉంటాడు. మండలస్థాయిలో అర్హులైన అధికారుల సంఖ్య తక్కువగా ఉంటే రెండు లేదా మూడు గ్రామ పంచాయతీలకు ఒకరిని ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, సహకారశాఖ అధికారులు, స్టాటిస్టికల్ అధికారులు, విద్యుత్ ఇంజనీర్లును గుర్తించి వారిని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తారు. సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి అన్ని మండలాల నుండి నివేదికలను జిల్లా యంత్రాంగాలు తెప్పించుకున్నాయి. వీటన్నింటినీ క్రోఢీకరించి, రాష్టస్థ్రాయిలో జాబితాలను రూపొందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేసే జాబితాలను మంత్రివర్గం పరశీలిస్తుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నిర్ణయానికి సంబంధించిన అంశానికి మంత్రివర్గం ఆమోదం లభించాల్సి ఉన్నంది. దీనితో మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం పొడగించడమా లేక ప్రత్యేక అధికారులను నియమించడమా అన్న అంశం అత్యంత ముఖ్యమైంది కావడం వల్ల మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 8,690 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 329 గ్రామపంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో గత మూడేళ్లలో కలిపివేశారు. అంటే 8,361 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. వీటికి తోడుగా 2,018 ఆగస్టు 2 నుండి కొత్తగా మరో 4,380 గ్రామ పంచాయతీలు పనిచేయడం ప్రారంభమవుతుంది. కొత్త గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల పాలన ఏర్పాటవుతుంది. పాత గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సర్పంచ్‌లు, వార్డుసభ్యుల కాలపరిమితి ఈనెల చివరితో ముగుస్తుంది.
ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌ల పదవీ కాలాన్ని పొడిగిస్తే, వారిని పర్సన్ ఇంచార్జీగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న సర్పంచ్‌లలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరిని కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం లేదని కేసీఆర్ సర్కారు భావిస్తోందని తెలుస్తోంది. ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేసి ఆరునెలల కాలం లో సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. దాంతో అధికార టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించాలని అనుకుంటున్నట్టు సమాచారం. చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ తదితరులు న్యాయ నిపుణులతో చర్చించారు. పంచాయతీరాజ్ కొత్త చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.