రాష్ట్రీయం

రామ మందిరంపై బీజేపీ వెనుకడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశం వివాదాస్పదం కావడంతో బీజేపీ వెనక్కు తగ్గింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో పార్టీ అధినేత అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించలేదని కేంద్ర కమిటీ ప్రకటించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటుందని అమిత్ షా వ్యాఖ్యానించినట్టు వివిధ ఛానళ్ల ముందు తెలంగాణ పార్టీ నేతలు చెప్పడంతో ఇది చర్చనీయాంశమైంది. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సున్నితమైన అంశంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎలా మట్లాడతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీనితో పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇదంతా మీడియా సృష్టేనంటూ వ్యాఖ్యానించింది. కాగా, అమిత్ షా వ్యాఖ్యలను మీడియాకు చెప్పిన రాష్ట్ర నాయకులు వివాదానంతరం దానిపై వివరణ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పార్టీ
జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ (శేఖర్‌జీ) రామాలయం విషయాన్ని మీడియాకు చెప్పారు. ఆ వార్తకు మీడియా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో వివాదం రాజుకుంది. దీనిపై అమిత్ షా ట్వీట్ చేస్తూ తాను తెలంగాణ పర్యటనలో రామాలయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. అజెండాలో కూడా రామాలయ అంశం లేదని ట్వీట్ చేశారు. ఇలావుంటే, ఎన్నికల ముందు ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టవుతుందని ఎంఐఎం నేత అసుదుద్దీన్ శనివారం నాడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు అసదుద్దీన్ సైతం ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరమే అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఉత్తమమని ఓవైసీ వ్యాఖ్యానించారు. అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించారని శేఖర్‌జీ పేర్కొన్న వెంటనే అసదుద్దీన్ ఓవైసీ పార్టీ నేతలతో భేటీ అయి చర్చించారు. అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించారని పేర్కొంటూ శేఖర్ జీ ప్రకటనను కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం విడుదల చేయడంతో రాష్ట్ర నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.