రాష్ట్రీయం

తుంగభద్రకు భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం సుమారు 76వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. జలాశయం పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, చిక్కమంగళూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరుజలాశయానికి చేరుతోంది. శనివారం ఏకంగా 76,527 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరింది. జలాశయంలో 66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత నాలుగు రోజుల్లో జలాశయానికి 24 టీఎంసీల నీరు వచ్చి చేరింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా శనివారం 1622.75 అడుగులుగా నమోదైంది. మరో పది అడుగుల నీరు చేరితే జలాశయం పూర్తిగా నిండుతుంది. 160 క్యూసెక్‌ల నీరు బయటకు వదులుతున్నారు. కాలువలకు నీటి విడుదలకై ఈనెల 16వ తేదీ జరిగే తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.