రాష్ట్రీయం

న్యాయమూర్తులను నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ఉమ్మడి హైకోర్టులో గత మూడేళ్లుగా ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల సంఘం , ఏపీ హైకోర్టు అడ్వకేట్ల సంఘం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టి బి రాధాకృష్ణన్‌ను కోరుతున్నాయి. గత మూడేళ్లుగా న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాలేదని, కేంద్రప్రభుత్వం వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన జాబితాను త్వరలో సుప్రీంకోర్టుకు పంపించనున్న నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా జాబితాలను పంపించాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు సి దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం హైకోర్టులో 3.5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి న్యాయమూర్తులను నియమించాల్సి ఉందని చెప్పారు. దేశంలోని 24 హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న 411 న్యాయమూర్తి పోస్టులకు గానూ 120 పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో కేంత్రద ప్రభుత్వం ఉందని, అయితే ఏపీ, తెలంగాణ నుండి ఒక్క పేరును కూడా ఇంత వరకూ సిఫార్సు చేయలేదని, కొత్త ప్రధాన న్యాయమూర్తి ఈ అంశంపై దృష్టి సారించాలని న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇంత కాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానే కొనసాగినందున జస్టిస్ రమేష్ రంగనాధన్ సిఫార్సులను పంపించలేకపోయారని, ప్రస్తుతం శాశ్వత ప్రధాన న్యాయమూర్తి వచ్చినందున, ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో ఖాళీల భర్తీకి చొరవ చూపాలని వారు కోరా రు. ఈ మేరకు త్వరలో ప్రధాన న్యాయమూర్తిని కూడా కలిసి ఒక వినతి పత్రం అందిస్తామని వారు చెప్పారు.
ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి
ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపట్నంలో కోట్లు ఖరీదు చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని, ఒక వేళ కబ్జా అయితే వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని హైకోర్టు భీమునిపట్నం తహసీల్దార్‌ను ఆదేశించింది. జస్టీస్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేష్ రంగనాధన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది.
సివిల్స్ ప్రిలిమ్స్‌లో తెలుగువారి ప్రతిభ
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2018 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలను శనివారం నాడు ఢిల్లీలో విడుదల చేసింది. జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 800 మంది మెయిన్ పరీక్షలకు ఎంపికయ్యారని సమాచారం. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు 2018 మెయిన్స్ పరీక్షలు రాసేందుకు రిజిస్టర్ చేసుకోవాలి. మెయిన్స్ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 7 వరకూ జరుగుతాయి.