రాష్ట్రీయం

ఆగస్టు 11 నుంచి నాలుగు రోజులపాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు భక్తులను అనుమతించరాదని టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. 9వ తేదీ సాయంత్రం 6గంటల లోపు వచ్చే భక్తులను మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తారు. వీరికి 11వ తేదీలోపు స్వామి దర్శనం భాగ్యం కల్పిస్తారు. అటు తరువాత ఆరు రోజులపాటు శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించకూడదని చారిత్రక నిర్ణయం తీసుకోవడం భక్తులను విస్మయ పరుస్తోంది. అయితే ఈ ఆరు రోజులపాటు భక్తులతోపాటు ధర్మకర్తల మండలికి సంబంధించిన కుటుంబ సభ్యులను, టీటీడీ ఉద్యోగులను కూడా అనుమతించరా? అనే అంశంపై వివరాలను టీటీడీ బహిర్గతం చేయడంలేదు. ఒక వేళ భక్తులకు మాత్రమే అనుమతి నిరాకరిస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే దర్శనాల నిలిపివేతకు సంబంధించి ధర్మకర్తల మండలి తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులను భక్తకోటికి తెలియజేసేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. ముందస్తుగా మీడియా పరంగా ఆరు రోజులపాటు దర్శనం ఉండదన్న విషయాన్ని భక్తుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆలయంలో ప్రతి పనె్నండేళ్లకోసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టడం టీటీడీ ఆనవాయితీగా పాటిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ఆరు రోజులపాటు పరిమితంగా భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. అయితే ఈ ఆరు రోజుల్లో వారాంతపు సెలవుదినాలతోపాటు ఆగస్టు 15 స్వంతంత్ర దినోత్సవం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు 80 నుంచి లక్ష వరకు ఉండవచ్చన్న అంచనాకు అధికారులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో పరిమితంగా కూడా భక్తులను అనుమతించడంపై టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం సమావేశమై సాధ్యాసాధ్యాలను చర్చించారు. చివరకు ఆరు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతించకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ విలేఖరులకు వివరించారు. బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం ఆగస్టు 11న అంకురార్పణతో ప్రారంభమవుతుందన్నారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో వైదిక కార్యక్రమాలు, శాంతిహోమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. భక్తులకు దర్శనం కల్పించడానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను టీటీడీ ధర్మకర్తల మండలి నిలిపివేయాలని నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి భక్తులకు క్యూలైన్లు, వైకుంఠం కంపార్ట్‌మెంట్లలోపలికి అనుమతించబోమని తెలియజేశారు. ఆగస్టు 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి భక్తులకు దర్శనం పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, జే ఈ ఓలు శ్రీనివాసరాజు, పోలభాస్కర్, ధర్మకర్తల మండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి, రాయపాటి సాంబశివరావు, పెద్దిరెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, సండ్ర వెంకటవీరయ్య, సుధానారాయణమూర్తి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణా రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..తిరుమలలో మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ సుధాకర్‌యాదవ్, ఈఓ సింఘాల్ తదితరులు