రాష్ట్రీయం

గవర్నర్‌తో సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, త్వరలో ప్రారంభం కానున్న హరితహారం నాలుగవ విడత, పంచాయతీ ఎన్నికలు, బిసీల రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నివేదిక కోరడం తదితర అంశాలపై వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అలాగే అవినీతి నిరోధకశాఖ చట్టంలో మార్పు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 2న ప్రారంభం కానున్న రైతు బీమా పథకంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలల్లో రాష్ట్ర విభజన హామీలపై తమ పార్టీ సభ్యులు కేంద్రంపై పట్టుబట్టే అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించినట్టు సమావేశం. పంచాయతీరాజ్ ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎదురైన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. నాలుగవ విడత హరితహారం, రైతు బీమా పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమాలకు ఈ సందర్భంగా కేసీఆర్ గవర్నర్‌ను ఆహ్వానించారని అంటున్నారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్