రాష్ట్రీయం

మార్చి 22న హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంకు కేసు విచారణకు సంబంధించి సుజన యూనివర్శల్ ఇండస్ట్రీస్‌కు చెందిన బోర్డు డైరెక్టర్లు ఈనెల 22న కోర్టు ఎదుట హాజరు కావాలని శనివారం ఇక్కడ 11వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సంస్థకు చెందిన బోర్డు డైరెక్టర్లు ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డారని మారిషస్ కమర్షియల్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారించింది. మారిషస్‌కు చెందిన హెస్టియా హోల్డింగ్స్ సంస్థ తమ సంస్థ నుంచి 106 కోట్ల రూపాయల రుణం తీసుకుందని, సంస్థకు సుజన యూనివర్శల్ ఇండస్ట్రీస్ సంస్ధ గ్యారంటీర్‌గా ఉందని బ్యాంకు పేర్కొంది. ఈ కేసు విచారణ శనివారం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు డైరెక్టర్లు జి శ్రీనివాసరాజు, కేంద్ర మంత్రి తరఫున న్యాయవాదులు హాజరై తమ వాదనలు వినిపించారు. బ్యాంకు తరఫున న్యాయవాది సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ కోర్టు ఈనెల 22కి కేసు విచారణను వాయిదా వేసిందని, బోర్డు డైరెక్టర్లు అందరికీ సమన్లు జారీ చేసిందని పేర్కొన్నారు.