రాష్ట్రీయం

మజ్లిస్ రెచ్చగొట్టినా పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: మజ్లీస్ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా పట్టించుకోరా? అని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని, పోలీసుల రాజ్యం, నిర్బంధకాండ అమలు అవుతున్నదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల్లో ఆరుగురిపై కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. పోలీసులకు దమ్ముంటే వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామి పరిపుర్ణానందను హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు బహిష్కరించడం దారుణమని అన్నారు. చరిత్ర గురించి మాట్లాడితే రెచ్చగొట్టినట్లు అవుతుందా? అని ప్రభాకర్ ప్రశ్నించారు. అలాగైతే మజ్లీస్ నేతలు పలు పర్యాయాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమే కాకుండా పోలీసు కమిషనర్‌కూ సవాల్ విసిరిన సందర్భాలూ ఉన్నాయని ఆయన తెలిపారు. అయినా వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము ఊరేగింపు నిర్వహించకుండా గృహ నిర్భంధం చేశారని యన తెలిపారు. రాజకీయ నాయకులకు, ఇతర సంఘాలకు నిరసన, ధర్నాలు నిర్వహించే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాలన్నీ చెబుతామని ఆయన తెలిపారు.