రాష్ట్రీయం

ఎడతెగని గాలింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూలై 16: తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశుపుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన విద్యార్థినుల్లో ఒకరి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థినులు సహా మొత్తం ఏడుగురు గల్లంతవ్వగా, వారిలో వివాహిత మృతదేహాన్ని ఆదివారం గుర్తించిన సంగతి విదితమే. సోమవారం సాయంత్రం ఐ.పోలవరం మండలం భైరవపాలెం సమీపంలో ఒక విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను కమిని శివారు వలసలతిప్పకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని తిరుకోటి ప్రియ (13)గా గుర్తించారు. కాగా గల్లంతైన వారి ఆచూకీకోసం గాలింపు చర్యలను సోమవారం మరింత ముమ్మరంచేశారు. నావికాదళానికి చెందిన హెలికాప్టర్, పోలీసు శాఖకు చెందిన డ్రోన్లను సైతం రంగంలోకి దించారు. మొత్తం 20 బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. యానాం బీచ్ రోడ్డులో ఏర్పాటుచేసిన బేస్ క్యాంపులో మకాంచేసిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కొద్దిసేపు పడవలో, మరికొద్దిసేపు హెలికాఫ్టర్‌లో గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం ఉదయం ఇక్కడకు చేరుకుని, గాలింపుచర్యలను పరిశీలించారు.
అందరి ఆచూకీ తెలిసేవరకూ గాలింపు
గల్లంతయిన వారందరి ఆచూకీ లభించేంత వరకూ గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. సోమవారం వాతావరణం అనుకూలించడంతో గాలింపు చర్యలను వేగవంతం చేశామన్నారు. పశువుల్లంక రేవు వద్ద సోమవారం సాయంత్రం నుండి 50 లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. పడవల్లో ప్రయాణం సాగించే వారు తప్పని సరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పడవ ప్రమాదంలో గల్లంతైన కుటుంబాల వారికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తిచేస్తామన్నారు. పడవ ప్రమాదం దురదృష్టకరమన్నారు.