రాష్ట్రీయం

వైభవంగా త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు కాలినడకన తిరుమల గిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకున్నారని, వారి అడుగుజాడల్లో నడిచి ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి పేజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వప్రసన్న తీర్థస్వామి అనుగ్రహభాషణం చేశారు. బ్రాహ్మీ ముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎతో పుణ్యఫలమని అన్నారు. పూర్వం పురందరదాసు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, రామానుజాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయులు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. అంతకుముందు భజన మండళ్ల భక్తులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుంచి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. సాంప్రదాయబద్దంగా మెట్లకుకర్పూర హారతులు సమర్పించారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాలకు చెందిన భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలను అధిరోహించారు.