రాష్ట్రీయం

మత్తు చాక్లెట్ల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: విదేశాల్లో తయారైన మత్తు చాక్లెట్లను దిగుమతి చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఏక కాలంలో దాడి చేసి రెండున్నర లక్షల విలువైన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన చాక్లెట్ల కంపెనీ నుంచి వచ్చిన వాటిని బేగంబజార్‌లోని ఒక దుకాణంలో విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్ అనే వ్యక్తి ఈ చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సమాచారం అందడంతో అబిడ్స్‌లోని రెండు దుకాణాల్లో ఏకకాలంలో దాడులు చేసి సుమారు వెయ్యికి పైగా మద్యం చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణదారులు ఢిల్లీ నుంచి మద్యం కలిపిన చాక్లెట్లను దిగుమతి చేసుకుని స్ధానికంగా అమ్ముతున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.