రాష్ట్రీయం

కలిసి నడుద్దాం... మజ్లిస్‌ను ఓడిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఇంత కాలం హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీపై స్నేహపూర్వక పోటీ చేశామని, ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీపై బలమైన అభ్యర్థులను పోటీకి దించి గెలుపొందేందుకు సీరియస్‌గా పని చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీసీపీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సమష్టిగా పని చేసి, మజ్లిస్‌ను ‘్ఢ’ కొట్టి ఓడిద్దామని ఆయన అన్నారు. సోమవారం గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరా భవన్ హాలులో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన నగర కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేవానికి ఏఐసీసీ కార్యదర్శి, హైదరాబాద్ ఇన్‌ఛార్జీ బోసు రాజు, ఉత్తమ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగిస్తూ మజ్లిస్‌పై పోటీకి సమర్థులైన నాయకులను దించుతామన్నారు. నగరంలో వెంటనే పోలింగ్ బూత్ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి కమిటీలో 14 మంది తప్పని సరిగా ఉండాలన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా సమన్వయకర్తలనూ నియమించాలని సూచించారు. డివిజన్ కమిటీలు, నగర కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. పార్టీని సంస్థాగతంగా పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు నగర పార్టీ అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలన్నారు. శక్తి ప్రాజెక్టును ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకతంగా పరిశీలిస్తున్నారని, ప్రతి కార్యకర్త శక్తి ఆప్‌లో సభ్యులుగా చేరాలని కోరారు. 79961 79961 నంబర్‌కు కార్యకర్తలు ఫోన్ చేసి ఎన్నికల కార్డు నెంబర్‌ను మెసెజ్ చేయాలని, అప్పుడు కార్యకర్తల నెంబర్ రిజిష్టర్ అవుతుందని తెలిపారు. దీని వల్ల అధిష్టానం ఆదేశాలు నేరుగా అందుతాయని ఆయన తెలిపారు. ఎటువంటి రుసుం లేకుండా సమాచారం చేరవేయవచ్చునని ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి కార్యకర్త శక్తిలో చేరాలని ఆయన సూచించారు.
ముందస్తు ఎన్నికలు..
ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మాటలను బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాయని, కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పార్టీకీ పూర్వవైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి నియోజకవర్గాల వారీగా పార్టీ పని తీరును సమీక్షిస్తారని, నాయకులు పార్టీ అభివృద్ధికి సంబంధించిన అంశాలలో అభిప్రాయాలను తెలియజేయాలని ఉత్తమ్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ తదితరులు ప్రసంగించారు.