రాష్ట్రీయం

ఈ పంచాయతీ మాకొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్లుగా వెళ్లేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. స్థానిక రాజకీయాలతో వేగలేమని, శాఖాపరమైన విధులకు కూడా ఆటంకం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెల చివరతో ముగుస్తుండటంతో స్పెషలాఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే, సంబంధిత అధికారులు ఉదిసీనత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 8,361 గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్లను నియమించాల్సి ఉంది. మండలస్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ, సహకార, విద్య, పంచాయతీ, ఉద్యాన, రెవెన్యూ, ఎండోమెంట్స్, విద్యుత్, ఐటిడిఏ, వివిధ సంక్షేమ శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా యంత్రాంగాలకు సమాచారం అందించింది. దాంతో ఇప్పటికే మండలాభివృద్ధి అధికారుల (ఎండీఓ) నేతృత్వంలో మండలస్థాయిలో ఉన్న అధికారుల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పంపించారు. స్పెషలాఫీసర్లుగా నియామకం అయ్యే అవకాశం ఉన్న వారిలో చాలా మంది నిరాసక్తంగా ఉన్నట్టు తెలిసింది. సంబంధిత అధికారులు పంచాయతీ ఉన్నతాధికారులను కలిసి తమ శాఖకు సంబంధించిన పని ఎక్కువగా ఉందని, గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల స్థానంలో స్పెషలాఫీసర్లుగా నియమించవద్దని కోరుతున్నట్టు సమాచారం. వీలైతే తమకు స్పెషలాఫీసర్ల బాధ్యతలు అప్పగించవద్దని అంటున్నారు. ఈ అధికారుల విజ్ఞప్తిని ఉన్నతాధికారులు మన్నిస్తారా? లేదా? అనే విషయం ఎలా ఉన్నప్పటికీ, గ్రామాల్లో పనిచేసేందుకు వివిధ కారణాల వల్ల మండలస్థాయి అధికారులు మక్కువ చూపడం లేదని తెలిసింది.
ఏ రకంగా చూసినా, గ్రామాల్లో ఉండే రాజకీయాలను తట్టుకోలేమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గ్రామ పంచాయతీలకు స్పెషలాఫీసర్లుగా నియాకమైతే, అదే గ్రామంలో నివాసం ఉండాల్సి వస్తుందని, రోజూ తాగునీటి సరఫరా, రోడ్లపరిశుభ్రత, విద్యుత్ లైట్ల పనితీరు పరిశీలించడం, మురుగునీటిపారుదల, వానలు వస్తే గ్రామాల్లో నీరు నిలువ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం తదితర పనులను చేయాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. పైగా ప్రతి గ్రామంలో అధికార పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉంటారని, ప్రతి పనిలో వారు జోక్యం చేసుకుంటూ ఉంటారని, తద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వారి ఆందోళన. ఈ కారణాల వల్ల గ్రామీణ రాజకీయాలను తాము తట్టుకోలేమని అంటున్నారు. ఉదాహరణకు మండల వ్యవసాయ అధికారి తన శాఖకు సంబంధించిన పని చూసుకుంటూ, ఒక గ్రామ పంచాయతీ పరిపాలనను చేపట్టాల్సి ఉంటుంది. స్పెషలాఫీసర్లుగా నియామకమయ్యేవారికి ఎలాంటి నగదు లబ్ధి (మానిటరీ బెనెఫిట్) ఉండదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో స్పెషలాఫీసర్లుగా పనిచేసేందుకు అధికశాతం మంది నిరాసక్తంగా కనిపిస్తున్నారు. నిజానికి వారంతా గ్రామాల్లో విధులను నిర్వర్తించేందుకు ఆందోళన చెందుతున్నారు.