రాష్ట్రీయం

స్మార్ట్ ఫోన్ కోసం హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: స్మార్ట్ ఫోన్ కోసం ఓ టీనేజర్ తన స్నేహితుడి ప్రాణాలనే హరించాడు. సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసులో మిస్టరీ సోమవారం వీడింది. స్నేహితుడే స్మార్ట్ ఫోన్ కోసం అతడిని కిడ్నాప్ చేసి, తలపై మోది హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం కలిగించింది. మితిమీరిన సెల్ ఫోన్ మోజు ఎలాంటి అకృత్యాలకైనా తెగించేలా చేస్తున్నదని ఈ ఉదంతం స్పష్టం చేస్తున్నది. కాగా, నిందితుడిని అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర్ రావు తెలిపారు. సోమవారం ఉప్పల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రామంతాపూర్ పాత బస్తీలో నివిసిస్తున్న ఘట్‌కేసర్ ఎదులాబాద్‌కు చెందిన గడ్డం స్వామి కుమారుడు ప్రేమ్ సాగర్ అలియాస్ ప్రేమ్ (19) నిరుద్యోగి. అతనికి అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చింది. స్నేహితులను అడిగితే ఇవ్వలేదు. దీంతో పక్కనే నివసిస్తున్న స్నేహితుడైన ఇంటర్ విద్యార్థి దాగే ప్రేమ్ (17) వద్ద ఉన్న స్మార్ట్ సెల్‌ఫోన్ కన్పించింది. తనకు ఇవ్వాలని అడిగితే అందుకు నిరాకరించాడు. ఎలాగైనా ప్రేమ్ సాగర్ వద్ద ఫోన్‌ను కొట్టేయాలన్న ఉద్దేశంతో పథకం రచించాడు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం సాయంత్రం లాంగ్ డ్రైవ్ పేరుతో తన బైక్‌పై ఎల్‌బీ నగర్ వైపుపై తీసికెళ్లాడు. మార్గ మధ్యంలో ఆగి, ఒక డబ్బాలో పెట్రోలు పోయించుకున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఆదిబట్ల ప్రాంతానికి తీసికెళ్లిన ప్రేమ్ సాగర్ తన స్నేహితులు వస్తున్నారని, కొద్ది సేపు వేచి చూద్దామని దాగే ప్రేమ్‌కు చెప్పాడు. కాగా, దాగే ప్రేమ్ తన సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండగా ప్రేమ్ సాగర్ తనతో తెచ్చుకున్న కర్రతో వెనుక నుంచి వచ్చి దాగే ప్రేమ్ తలపై దొంగ దెబ్బ కొట్టాడు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కొన్నాడు. కింద పడపడి గాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ప్రేమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. తిరిగి ఏమీ ఎరుగనట్లుగా ఇంటికి వచ్చాడు. సాయంత్రం వరకు కుమారుడు ఇంటికి రాలేదని కంగారు పడ్డ దాగే ప్రేమ్ తండ్రి సురేష్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా తానే సెల్ ఫోన్ కోసం హత్య చేశానని ప్రేమ్ సాగర్ ఒప్పుకున్నట్లు డీసీపీ ఉమా మహేశ్వర్ రావు పేర్కొన్నారు. అతని వద్ద బైక్, కర్ర, పెట్రోల్ డబ్బా స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టుకు తరలించినట్లు తెలిపారు.