రాష్ట్రీయం

ఏడాది చివరిలోగా డిండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: డిండి ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలోగా పూర్తవుతుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పంచ ప్రాజెక్టులుగా పిలిచే, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టంపాడ్, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని అన్నారు. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నాం కాబట్టి, పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. జలసౌధలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి చర్చించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పరిధిలో సర్వీస్ బే కంట్రోల్ పనులు వేగవంతం చేయాలని హరీశ్ ఆదేశించారు. ఆగస్టు 31 లోగా పంపులు పని చేయాలన్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద ఇంకా 200 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని అధికారులు వివరించారు. దీంతో సమావేశం నుంచే మహబూబ్‌నగర్ కలక్టర్ రోనాల్డ్ రోస్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. భూ సేకరణపై మంగళవారమే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా కలక్టర్‌ను ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రాజెక్టు ఇంజనీర్లు, రెవిన్యూ అధికారులు హాజరు కావాల్సిందిగా మంత్రి సూచించారు. నెట్టంపాడు ప్రాజెక్టు పనులపై ప్యాకేజీల వారీగా మంత్రి సమీక్షించారు. సంగాల రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్యాకేజి 102లో ప్రధాన కాలువల స్ట్రక్చర్ పనులు, ఫీడర్ చానల్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ 105 కింద ఫీడర్ చానల్ నిర్మాణం కోసం భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాగా, ఫీడర్ చానల్ తవ్వకానికి స్థానికులు ఏమాత్రం సహకరించడం లేదని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని కలక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సహకారాన్ని తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీ 28లో 30 ఎకరాల భూ సేకరణ మిగిలిపోయిందని అధికారులు వివరించారు. ఎగువనున్న తుంగభద్ర నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో వరదలు రాకముందే కార్మికుల సంఖ్యను పెంచి, రాత్రింబవుళ్లు పని చేసి, స్ట్రక్చర్, ఫీడర్ చానల్ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు కాలువల ద్వారా ఏప్రిల్ నుంచి సాగునీరు అందించడం వల్ల కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయినట్టు అధికారులు వివరించారు. ఆల్మట్టి, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయంలోకి నీరు రాగానే కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లను ఆన్ చేయాలని మంత్రి సూచించారు.
డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక చీఫ్ ఇంజనీర్
డిండి ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా చీప్ ఇంజనీర్‌ను నియమించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను ఈ ఏడాదిలోగా పూర్తి చేసి వీటి పరిధిలోని చెరువులు నింపాలని ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి వెంటనే రూ. 10 కోట్లు విడుదల చేయనున్నట్టు మంత్రి చెప్పారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని మంత్రి హెచ్చరించారు.